Farmers protest on time magazine: రైతుల ఆందోళనకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. విదేశీ సెలెబ్రిటీల ట్వీటా్  లతో అంతర్జాతీయ దృష్ఠిని ఆకర్షించిన రైతు ఆందోళనకు ఈసారి ఏకంగా ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ప్రాధాన్యత కల్పించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం (Central government) తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో రైతుల ఆందోళన చర్చనీయాంశమైంది. మరోవైపు అంతర్జాతీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా రైతు ఆందోళన( Farmers protest )కు మద్దతిచ్చారు. ఇప్పుడు మరోసారి రైతుల ఆందోళన అంతర్జాతీయ వేదికనెక్కింది. మార్చ్ 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా..ప్రపంచ విఖ్యాత టైమ్ మేగజైన్ ప్రధాన్యత కల్పించింది. రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులకు అంటే భారతీయ మహిళా రైతులకు ఈసారి ప్రపంచ మహిళా దినోత్సవాన్ని( World womens day) అంకితమిచ్చేసింది. మార్చ్ సంచిక కవర్ పేజీ(Time magazine cover page)గా రైతు నిరసనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న 20 మంది మహిళా రైతులు పసి బిడ్డల్ని ఎత్తుకుని ఉన్న ఫోటోను ముద్రించింది.


నన్ను బెదిరించలేరు, నన్ను కొనలేరు శీర్షికతో కధనం ప్రచురించింది. ఇందులో ఎన్ని బాధలు ఎదురైనా వెన్ను చూపకుండా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా రైతులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారని కీర్తించింది. నిరసనలు కట్టిపెట్టి మహిళల్ని, వృద్ధుల్ని వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం చెప్పడాన్ని కధనంలో ప్రస్తావించారు. అంతేకాకుండా  సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి కూడా మహిళలు వెనక్కి వెళ్లేలా బుజ్జగించమని ప్రభుత్వానికి చెప్పినప్పటికీ..మహిళలు తమ గళం వినిపిస్తూనే ఉన్నారని నీలాంజన భౌమిక్‌ రాసిన ఆ కథనం పేర్కొంది. మొత్తానికి రైతుల ఉద్యమం ఇప్పుడు టైమ్ మేగజైన్ (Time magazine) పతాక శీర్షికల్ని తాకింది.


Also read: iPhone X exploded in pocket: సైంటిస్ట్ పాకెట్‌లో iPhone X పేలిన ఘటనలో Apple పై కేసు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook