ట్రంప్, కిమ్ భేటీ సక్సెస్ ; అమెరికా-ఉత్తరకొరియా మధ్య చారిత్రక ఒప్పందాలు
సింగపూర్ వేదికగా అమెరికా-ఉత్తరకొరియా మధ్య చారిత్రక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పంద పత్రాలపై ఆయా దేశాల అధ్యక్షులు ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు ఒప్పందాలు ఇలా ఉన్నాయి..
* కొరియా ద్వీపకల్పంలో స్ధిరమైన శాంతి నెలకొనేలా అమెరికా, ఉత్తర కొరియా కలిసి పనిచేయాలని నిర్ణయం
* యుద్ధ ఖైదీలను వెంటనే స్వదేశానికి తిప్పి పంపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
* కొరియాలో అణురహిత సమాజం దిశగా కృషిచేయడం
* శాంతస్థాపన కోసం అమెరికా, ఉత్తర కొరియా నూతన సంబంధాలు ఏర్పరచుకోవడం.
సింగపూర్ సదస్సులో భాగంగా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ భేటీ అయ్యారు . ఈ సందర్భంగా ఇరువురు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ భేటీ అనంతరం సంయుక్త మీడియా నిర్వహించిన ట్రంప్, కిమ్ ..తమ మధ్య జరిగిన చారిత్రక సమావేశం విజయవంతంగా ముగిసిందని ప్రకటించారు. అమెరికా-ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందన్నారు..కాగా ట్రంప్, కిమ్ ఏకాంత భేటీ తర్వాత ఇరుదేశాలకు చెందిన ప్రతినిధి బృందాల సమక్షంలో వారు మరోసారి సమావేశమవుతారు.