కరోనా వైరస్ దెబ్బకు అగ్ర రాజ్యం అమెరికా గజగజా వణుకుతోంది. ఇప్పటికే ట్రావెల్ బ్యాన్ విధించారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా మరో నిర్ణయం కూడా  తీసుకున్నారు.  కోవిడ్ 19ను ఎదుర్కునేందుకు అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటి వరకు 1800 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అమెరికా అంతటా ప్రజల్లో ఆందోళన నెలకొంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను  ఎదుర్కునేందుకు 5 వేల కోట్ల డాలర్లను విడుదల చేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.  అంతటితో ఆగకుండా తాను కూడా పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు ట్రంప్. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోతోపాటు   ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోను కూడా కలిశారు.  ఇందులో ఫాబియోకు కరోనా వైరస్ సోకినట్లుగా వెల్లడైంది. దీంతో ట్రంప్ కలిసిన సమయంలోనే ఆయనకు కరోనా వైరస్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


[[{"fid":"183125","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Read Also: అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఏర్పాట్లు...


ఈ నేపథ్యంలో వైట్ హౌస్ లో విలేకరులు..'' ప్రెసిడెంట్ ట్రంప్ మీరు కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంటారా..?''  అని ప్రశ్నించారు. తాను కూడా పరీక్షలు చేయించుకోవాల్సి రావచ్చు.  ఐతే కరోనా వైరస్ పరీక్షలు చేయించుకునేందుకు తాను వ్యతిరేకం  కాదని  అన్నారు. మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కరోనా  వైద్య పరీక్షలు  చేయించుకోగా ఆయకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ కాస్త  ఊపిరిపీల్చుకున్నారు.  దాదాపు 2 గంటలు వారితో గడిపినట్లు తెలిపారు. వారితోనే కలిసి భోజనం చేశానని అన్నారు. ఐతే తాను కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించుకుంటానని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..