Tsunami Warning: హిందూ మహా సముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం నమోదవడంతో..సునామీ హెచ్చరికలు తప్పలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండోనేషియా సమీపంలోని ఈస్ట్ తైమూర్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోవడంతో ఇండియన్ ఓషియన్ సునామీ వార్నింగ్ మెటిగేషన్ సిస్టమ్ హిందూ మహా సముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈస్ట్ తైమూరు ఇండోనేషియా మధ్య తైమూర్ ద్వీపం నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. 


పసిఫిక్ రిమ్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా తదితర దేశాలకు భూకంపాల బెడద ఎక్కువ. టెక్టానిక్ ప్లేట్లలో నిరంతరం ఏర్పడే కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తుంటాయి. దీనికితోడు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే అగ్నిపర్వతాలు బద్దలవుతుండటం వల్ల కూడా భూమి లోపలి పొరల్లో మార్పులు సంభవిస్తుంటాయి. ఈసారి ఏర్పడిన భూకంపం తీవ్రత 6.1 కావడంతో సునామీకు దారి తీయవచ్చనే హెచ్చరికలు జారీ అయ్యాయి.


2004లో సమత్రా దీవుల్లో ఏర్పడిన భారీ భూకంపం 9.1 కారణంగా హిందూ మహాసముద్రంలో భారీగా సునామీ ఏర్పడింది. ఆ సునామీ ప్రభావం అప్పట్లో ఇండియా, శ్రీలంక దేశాలపై కూడా పడింది. ఒక్క ఇండోనేషియాలోనే 1 లక్షా 70 వేల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 20 వేల మంది మృతి చెందారు. అప్పటి నుంచి భూకంపం వచ్చిన ప్రతిసారీ..అప్పమత్తమై..తీవ్రతను బట్టి సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే సునామీ హెచ్చరికల వ్యవస్థ కూడా అప్పుడే ఏర్పాటైంది. 


Also read: CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ టూర్ సక్సెస్..రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి