Turkey, Syria Earthquake: టర్కీ, సిరియాలో భూకంపం.. 6,200 దాటిన మృతుల సంఖ్య
Turkey, Syria Earthquake News Live Updtes: టర్కీ భూకంపం వేలాది మందిని నిరాశ్రయులను చేసి రోడ్డునపడేసింది. దీంతో భూకంపం బాధితులను ఆదుకునేందుకు స్కూల్స్, కాలేజీ భవనాలు, హోటల్స్‌ని టర్కీ ప్రభుత్వం సహాయ శిబిరాలుగా మార్చేసింది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని టర్కీ ప్రభుత్వం రెఫ్యూజీ సెంటర్స్‌కి తరలించి వారికి అక్కడే ఆహారంతో పాటు కనీస సౌకర్యాలు అందిస్తోంది.
Turkey, Syria Earthquake News Live Updtes: టర్కీ భూకంపంలో, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 6 వేలు దాటింది. టర్కీలో భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4554 కి చేరగా.. సిరియాలో భూకంపం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,712 కి పెరిగింది. టర్కీ, సిరియాలో కలిపి మొత్తం డెత్ టోల్ 6,256 కి పెరిగింది. కుప్పకూలిన భారీ భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ భారీ సంఖ్యలో శవాలు వెలుగుచూస్తున్నాయి. కొన్నిచోట్ల శిథిలాల కింద నుంచి ప్రాణంతో ఉండి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న డిజాష్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ బలగాలు ప్రాణాలతో కాపాడుతున్నాయి. ఒక్క టర్కీలోనే దాదాపు 8 వేలకు పైగా మందిని శిథిలాల కింద నుంచి కాపాడారు.
టర్కీ భూకంపం వేలాది మందిని నిరాశ్రయులను చేసి రోడ్డునపడేసింది. దీంతో భూకంపం బాధితులను ఆదుకునేందుకు స్కూల్స్, కాలేజీ భవనాలు, హోటల్స్‌ని టర్కీ ప్రభుత్వం సహాయ శిబిరాలుగా మార్చేసింది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని టర్కీ ప్రభుత్వం రెఫ్యూజీ సెంటర్స్‌కి తరలించి వారికి అక్కడే ఆహారంతో పాటు కనీస సౌకర్యాలు అందిస్తోంది. అలా ఇప్పటివరకు శిబిరాలలో తలదాచుకుంటున్న వారి సంఖ్య 3,80,000 పైనే ఉందని టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. టర్కీలో కుప్పకూలిన ఓ భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన ఓ 20 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆధారంగా రక్షణ బలగాలు అతడిని సురక్షితంగా రక్షించాయి.
భూకంపం కారణంగా అతలాకుతలమైన టర్కీలోని 10 ఆగ్నేయ ప్రావిన్సులలో 3 నెలల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయిప్ ఎర్డోగన్ ప్రకటించారు. అతి శీతల వాతావరణం కారణంగా సాయంకాలం నుంచి మరునాడు తెల్లవారి జాము వరకు సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
ఇదిలావుంటే, సిరియాకు భారత ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం కింద మెడిసిన్స్, ఆహారం, శిథిలాలను తొలగించేందుకు సహాయపడే అత్యాధునిత డ్రిల్లింగ్ మెషిన్లు సహా మొత్తం 6 టన్నుల కన్సైన్‌మెంట్‌తో ఉన్న ప్రత్యేక యుద్ధ విమానం సిరియాకు బయల్దేరింది.
ఈ కష్టకాలంలో సిరియాకు భారత్ అండగా నిలుస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి డా ఎస్ జైశంకర్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన విమానం సిరియాకు బయల్దేరిందని ట్వీట్ చేస్తూ కేంద్ర మంత్రి జై శంకర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. మరోవైపు టర్కీలో భూకంపం బాధితులను ఆదుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిలీఫ్ మెటిరియల్‌తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన యుద్ధ విమానం C-17 బోయింగ్ ఫ్లైట్ సోమవారమే టర్కీకి చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : Turkey Earthquake News Updtes: టర్కీకి భారత్ సాయం.. అడ్డు చెప్పిన పాకిస్థాన్
ఇది కూడా చదవండి : Turkey Earthquake: టర్కీ సిరియా దేశాల్లో పొంచి ఉన్న మరో పెను ముప్పు, భయంతో వణికిపోతున్న ప్రజలు
ఇది కూడా చదవండి : Earthquake: భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశాలేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook