Viral Video today: భానుడు భూమి మీదకు వస్తున్న సమయంలో ఏర్పడిన భూకంపం ఎంతో మంది జీవితాలను అస్తమయం చేసింది. అప్పుడే నిద్రలోంచి బయటకు వస్తున్న ఆ జనాలను శాశ్వతంగా గాఢ నిద్రలోకి పంపించేసింది. ఎన్నో బంధాలను  చిదిమేసింది. గూడు నీడ లేకుండా చేసింది. ఆప్తుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఆక్రనందన చేసింది. ఇన్ని భయానక పరిస్థితుల మధ్య ఓ చిన్నారి చేసిన సాహసం అందరీ హృదయాల్ని కదలించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం తుర్కియేలో ఏర్పడిన భూకంపం పక్క దేశాల్లో కూడా ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం ధాటికి ముఖ్యంగా సిరియాలో చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వేలాది భవానాలు నేలమట్టమయ్యాయి. ఈ శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అధికారులు రెండు రోజులుగా శ్రమిస్తున్నారు. ఆ సమయంలోనే ఓ హృదయావిధారకర దృశ్యం కనిపించింది. 


భూకంపం ధాటికి తను ఉంటున్న భవనం కూలిపోయి.. శిథిలాల కింద చిక్కుకుపోయారు ఓ అక్కాతమ్ముడు. ఓవైపు తాను బండరాయి కింద నలిగిపోతున్నా మరోవైపు తమ్ముడికి ఏమీ కాకూడదని ఏకధాటిగా 17 గంటల పాటు అతడి తలకు చెయ్యి అడ్డుగా పెట్టి కాపాడింది ఏడేళ్ల బాలిక. ప్రస్తుతం ఈ ఫిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె సాహసాన్ని పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు. వారిద్దరినీ సురక్షితంగా అధికారులు బయటకు తీశారు. 



Also Read: Turkey Earthquake: భారీ భూకంపం సమయంలో మహిళ ప్రసవం.. కుప్పకూలిన భవనాల కింద పసికందు సేఫ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి