టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం ప్రళయమై విరుచుకుపడింది. ఒకేరోజు ఏకంగా మూడుసార్లు భూమి కంపించింది. ఇప్పటి వరకూ 4000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వరుస మూడు భూకంపాలతో ఇప్పుడు మరో సవాలు విరుచుకుపడనుందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపంతో అతలాకుతలమైంది. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. 4 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. పెద్ద పెద్ద భవంతులు నేలమట్టమయ్యాయి. భారీ విధ్వంసం జరిగింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై తొలుత 7.9గా, రెండవసారి 7.5గా, మూడవసారి 6 నమోదైంది. మూడు వరుస భూకంపాలతో ప్రజల జీవితం నాశనమైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం మరణాల సంఖ్య 10 వేలు ఉండవచ్చని తెలుస్తోంది. 


టర్కీలో వరుసగా మూడు సార్లు భూకంపం సంభవించింది. నిన్న అంటే ఫిబ్రవరి 6వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తొలిసారి 7.9 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తరువాత రెండవసారి మద్యాహ్నం 7.5 తీవ్రత నమోదైంది. మూడవసారి సాయంత్రం రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది. ఈ మూడే కాకుండా..చిన్న చిన్న భూ ప్రకంపనలు రోజంతా 20 కంటే ఎక్కువసార్లే సంభవించింది. ఈ భూ ప్రకంపనల వల్ల టర్కీ, సిరియాల్లో బిల్డింగులు బాగా బలహీనమైపోయాయి. చాలా భవనాలు కూలకపోయినా..పునాదులు బలహీనమయ్యాయి. కొన్ని ఇళ్ళకు భారీగా బీటలు వారాయి. ఎందుకంటే తొలిసారి భూకంపం సంభవించినప్పుడు కూలకుండా ఆగిన భవనాలు రెండవసారి భూమి కంపించినప్పుడు కూలిపోయాయి. అంటే ఇప్పుడు టర్కీ, సిరియా దేశాల్లో మిగిలున్న ఇళ్లకు ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందో అంచనా వేయడం కష్టమే. 


మూడుసార్లు భూమి తీవ్రంగా కంపించిన తరువాత  టర్కీ, సిరియా దేశాల్లో బిల్డింగులు పూర్తిగా బలహీనమయ్యాయి. భూ ప్రకంపనల కారణంగా ఆ బిల్డింగుల పునాదులు సామర్ధ్యాన్ని కోల్పోయాయి. మరోసారి భూమి కంపిస్తే ఇక ఉన్నభవనాలన్నీ నేలకూలడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇక టర్కీ, సిరియా దేశాల్లో భారీ వినాశనమే. మనుషుల ప్రాణాలు పోవడమే కాకుండా భారీ విళయం రావచ్చు. ఇక మౌళిక సదుపాయాల సమస్య ఏర్పడుతుంది. అంటే టర్కీలో ఇప్పుడు మరోసారి భయంకర విధ్వంసం పొంచి ఉంది.


Also read: Earthquake in Turkey, Syria LIVE Updates: భారీ భూకంపం దాటికి టర్కీ, సిరియా అతలాకుతలం.. 2308కి చేరిన మృతుల సంఖ్య!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook