Twitter CEO Jack Dorsey | ఏదైనా తొలి ఘనత, తొలి సంపాదన, తొలి ఉద్యోగం, తొలి పని, తొలి శతకం.. ఇలా ఏదైనా సరే తొలిసారి చేసినది, సాధించినది జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేము. ప్రస్తుత తీరికలేని జీవితంలో ఏం చేసినా సరే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొందరు తమ ఘనతల్ని జాగ్రత్తలు దాచిపెడతారు. అయితే సోషల్ మీడియాలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్విట్టర్‌లో చేసిన తొలి ట్వీట్ రికార్డు ధరకు అమ్ముడుకు సిద్ధంగా ఉంది. ట్వీట్ అమ్మడం ఏంటని ఆలోచిస్తున్నారా. అయితే ఇది చదవండి. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ(Twitter CEO Jack Dorsey) చేసిన తొలి ట్వీట్ ఏకంగా 2.5 మిలియన్ అమెరికా డాలర్లకు అమ్ముడుకానుంది. ట్విట్టర్‌లో చేసిన తొలి ట్వీట్ ఏకంగా రూ.18 కోట్ల రూపాయాలకు వేలంలో కొనుగోలు చేసేందుకు ఓ ఔత్సాహికుడు సిద్ధమయ్యాడు.


Also Read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు


ట్విట్టర్ తొలి ట్వీట్..
ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ మార్చి 21, 2006లో ‘జస్ట్‌ సెట్టింగ్‌ అప్‌ మై ట్విటర్‌’ అంటూ ట్విట్టర్‌లో తొలి ట్వీట్ చేశారు. ట్విట్టర్‌(Twitter)లో పోస్ట్ అయిన తొలి ట్వీట్ ఇదే. ఈ ట్వీట్‌ను ‘వాల్యుబుల్స్‌ బై సెంట్‌’ అనే వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టగా విశేష స్పందన లభిస్తోంది. దాదాపు లక్ష మంది వరకు తాము ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ఓ ఔత్సాహికుడు అత్యధికంగా  2.5 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకు చ్చాడు. భారత కరెన్సీలో దీని విలువ రూ.18 కోట్ల పైమాటే ఉంటుంది.


Also Read: WhatsApp Privacy Policy అంగీకరించకపోతే వినియోగదారులకు వాట్సాప్ సేవలు బంద్


ఎవరైతే ట్వీట్‌ను కొనుగోలు చేస్తారో.. వారికి ట్విట్టర్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర్సీ డిజిటల్‌గా వెరిఫై చేసి, సంతకం చేసిన డాక్యుమెంట్ వారికి అందించనున్నారు. జాక్ డోర్సీ చేసిన తొలి ట్వీట్‌తో పాటు పోస్ట్ చేసిన సమయం లాంటి పూర్తి వివరాలు ఆ పత్రంలో ఉండేలా డిజైన్ చేస్తారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook