అమెజాన్ ఉద్యోగులకు కరోనా వైరస్
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ భూతం తాజాగా ఇటలీలో ఇద్దరు అమెజాన్ ఉద్యోగులు కరోనావైరస్ (COVID-19)బారిన పడినట్లు తెలిపింది. అమెజాన్ ప్రతినిధి డ్రూహెర్డెనర్ మాట్లాడుతూ.. ఎవరైతే మిలాన్, క్వారంటైన్ లో ఉన్న, కరోనా బాధిత ఉద్యోగులకు కంపెనీ
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ భూతం తాజాగా ఇటలీలో ఇద్దరు అమెజాన్ ఉద్యోగులు కరోనావైరస్ (COVID-19)బారిన పడినట్లు తెలిపింది. అమెజాన్ ప్రతినిధి డ్రూహెర్డెనర్ మాట్లాడుతూ.. ఎవరైతే మిలాన్, క్వారంటైన్ లో ఉన్న, కరోనా బాధిత ఉద్యోగులకు కంపెనీ మద్దతు పూర్తి స్థాయిలో నివారణ చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ లోని కార్యాలయంలో గత వారంలో గూగుల్ ఉద్యోగికి COVID-19 కు పాజిటివ్ ఉందని తేల్చారు. గూగుల్ సంస్థలు చెందిన ఉద్యోగులను ఇరాన్, ఇటలీ, చైనాకు వెళ్లడానికి పరిమితం చేసింది. మరోవైపు టెక్ దిగ్గజం, ఏప్రిల్‌లో ఉత్తర కాలిఫోర్నియాలో జరగనున్న ‘గ్లోబల్ న్యూస్ ఇనిషియేటివ్’ శిఖరాగ్ర సమావేశాన్ని కూడా రద్దు చేసింది. అమెరికా సహా వివిధ దేశాల పర్యటనలను అమెజాన్ ఇప్పటికే నిలిపివేసింది.
గత డిసెంబర్‌లో చైనా నగరమైన వుహాన్‌లో వైరస్ ప్రబలిన నాటి నుండి ప్రపంచవ్యాప్తంగా 87,000 మందికి పైగా సోకగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 మంది కరోనా వైరస్ వాళ్ళ మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..