ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న 'కరోనా వైరస్' చైనాలోని వుహాన్‌లో ప్రారంభమైంది. దాంతో అక్కడ లాక్ డౌన్ విధించారు. ఐతే రెండు నెలల పాటు కొనసాగిన లాక్ డౌన్ నేటితో అంతమైంది. ఈ రోజు నుంచి వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి జనం ఊపిరిపీల్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ..  ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా వైరస్.. చైనాను కూడా నీడలా వెంటాడుతూనే ఉంది. ఐనప్పటికీ వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తివేయడానికి కారణం లేకపోలేదు. చైనాలో ఇప్పటికీ కరోనా వైరస్ లొంగి రాలేదు. అంతే కాకుండా.. కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న  వైరస్ మళ్లీ విజృంభించడం మొదలు పెట్టింది. 


 కోటి 10  లక్షల జనాభా ఉన్న వుహాన్‌లో తొలుత లాక్ డౌన్ విధించారు.  కానీ ఇప్పుడు ఆ లాక్ డౌన్ ఎత్తివేసి.. అక్కడి నుంచి ఆరోగ్యంగా ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలని చైనా అధికారులు సూచించారు. వుహాన్‌లో ఇప్పటి వరకు 50  వేల మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అందులో 2 వేల 500 మంది చనిపోయారు. మరోవైపు గత 21 రోజులుగా వుహాన్‌లో కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం విశేషం. ఈ రోజు దాదాపు 50  వేల మందికి పైగా వుహాన్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విమానాల ద్వారా దాదాపు 10 వేల మంది వుహాన్ నుంచి వెళ్లిపోయారు.  


మరోవైపు వుహాన్ నుంచి బీజింగ్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా రెండు దఫాలుగా కరోనా పరీక్షలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అటు కరోనా కేసులు 24 గంటల్లో రెట్టింపు కావడం చైనాను గుబులు పుట్టిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్ల చైనాలో కేసులు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. మంగళవారం ఒక్క రోజే 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐతే సోమవారంతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపయింది. సోమవారం నాడు 32 కేసులు నమోదయ్యాయి. మార్చి 25 తర్వాత.. మంగళవారం నాడు నమోదైన సంఖ్యే గరిష్టం కావడం విశేషం. అందులో 59 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని చైనా వైద్య ఆరోగ్య శాఖ కమిషన్ ప్రకటించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..