ఉగ్రవాదంపై పోరుకు అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న ఖర్చు వింటే ఎవరైనా ఎవరైనా షాక్ తినాల్సిందే..రోజుకు ఏకంగా రూ.1600 కోట్లు  ఖర్చు చేస్తుందట..ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగం వార్షిక నివేదికలో వెల్లడించింది. కాగా ఆప్ఘాన్, ఇరాక్ లలో యుద్ధానికి రూ. 84 లక్షల కోట్లు ఖర్చు చేయగా... ఇరాక్, సిరియాలలో రూ. 1.1 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు నివేదికలో తెలిపింది.   


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదంపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. 2001 సెప్టెంబర్ 11 డబ్ల్యూటీవో సెంటర్ పై  ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదంపై పోరుకు  పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన అమెరికా .. ఇప్పటి వరకు అంటే పదహరేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు  ఉగ్రపోరు కోసం చేసిన ఖర్చును వివరిస్తూ అమెరికా రక్షణ విభాగం 74 పేజీలతో కూడిన ఓ నివేదికను విడుదల చేసింది.