UAE announces Four and Half-day working week starting next year: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగున్నర రోజుల పనిదినాలను (Four And Half-Day Working Week) వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్టు యూఏఈ ప్రకటించింది. శని, ఆదివారాలను వారాంతపు సెలవు దినాలుగా పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌లతో మరింత అనుసంధానం అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుందని అక్కడి అధికారిక మీడియా డబ్ల్యూఏఎం ()WAM వెల్లడించింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది ఆరంభం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం యూఏఈ చమురు ఉత్పత్తి, పర్యాటక కేంద్రంగా బాగా పాపులర్ అయింది. వీటితో పాటు వాణిజ్యంతో తమ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. తాజా నిర్ణయంతో 2022 జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు (New Weekend) శుక్రవారం మధ్యాహ్నం నుంచే ప్రారంభమవుతాయి. వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలై.. ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. అంటే అక్కడ నాలుగున్నర రోజుల పనిదినాలే అన్నమాట. యూఏఈ (UAE) ఆర్థిక వ్యవస్థను పొరుగున ఉన్న సౌదీ అరేబియాతోకి పోటీగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులను, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకొన్న విషయం తెలిసిందే.


Also Read: Wankhede Pitch Curator: వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌కు నగదు బహుమతి.. అసలు కారణం అదే!!


'శనివారం, ఆదివారం సెలవుగా పాటించే దేశాలతో ఆర్థిక లావాదేవీలు సజావుగా జరిగేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంతో దేశంలో పనిచేసే వేలకొద్దీ అంతర్జాతీయ కంపెనీల లావాదేవీలు మరింత సరళంగా జరుగుతాయి. అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు కూడా మెరుగవుతాయి. పని-జీవితం మధ్య సమతౌల్యాన్ని ఈ నిర్ణయం మరింత పెంచుతుంది' అని యూఏఈ ప్రభుత్వం (UAE Govt) ఓ ప్రకటనలో పేర్కొంది. 


Also Read: Covid Third Wave in India: జనవరిలోనే కరోనా థర్డ్ వేవ్.. ఫిబ్రవరిలో పీక్ స్టేజ్! రోజుకు లక్షకు పైగా కేసులు!!


ముస్లింలు అధికంగా ఉన్న చాలా దేశాల్లో శుక్రవారం సెలవు దినంగా ఉంది. శుక్రవారం ఉపన్యాసాలు, ప్రార్థనలు మరియు ఉపవాసాలు ఉంటాయి కాబట్టి చాలా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అన్నింటిని దృష్టిలో ఉంచుకునే శుక్రవారం పనివేళలు మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయని యూఏఈ ప్రకటించింది. ఇక వివాహానికి ముందు సహజీవనం, ఆల్కహాల్ మరియు వ్యక్తిగత స్థితి చట్టాలను యూఏఈ ఇప్పటికే సరళీకృతం చేసింది. ప్రతిభను ప్రోత్సహించే దిశగా దీర్ఘకాలిక వీసాలను కూడా ప్రవేశపెట్టింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook