UK New Travel Rules: ఇండియా సహా కొన్నిదేశాలపై యూకే కొత్తగా ట్రావెల్ ఆంక్షలు విధించింది. వ్యాక్సిన్ వేయించుకున్నా..క్వారెంటైన్ నిబంధనలు తప్పనిసరి అని అంటోంది. బ్రిటన్ విధించిన ఆంక్షలపై ఇండియా మండిపడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) నుంచి కోలుకుంటున్న తరుణంలో ఇప్పుడిప్పుడు విదేశీ ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. ఈ తరుణంలో బ్రిటన్ కొత్తగా ట్రావెల్ ఆంక్షల్ని విధించింది. అది కూడా ఇండియా సహా కొన్నిదేశాలపై మాత్రమే. ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలతో పాటు యూఏఈ, ఇండియా, టర్కీ, జోర్డాన్, థాయ్‌లాండ్, రష్యా దేశాల్లో వేయించుకున్న వ్యాక్సిన్‌ను పరిగణలో తీసుకోమని స్పష్టంగా చెబుతోంది. అందుకే ఈ దేశాల్నించి వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నా లేకపోయినా పదిరోజుల క్వారెంటైన్ తప్పనిసరిగా పాటించాలని యూకే కొత్త ట్రావెల్ ఆంక్షలు(Uk New Travel Rules) విధించింది. ఇప్పటి వరకూ దేశాల్ని మూడు కేటగరీలుగా అంటే గ్రీన్, అంబర్, రెడ్‌లుగా విభజించి యూకే ప్రయాణ నిబంధనల్ని అమలు చేస్తూ వచ్చింది. ఇండియా అంబర్ కేటగరీలో ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం రెడ్ కేటగరీ మాత్రమే ఉంది. అక్టోబర్ 4 నుంచి కొత్త నిబంధనలు అమల్లో వస్తాయని తెలిపింది. మిగిలిన దేశాలకు మాత్రం ఆంక్షల్ని సడలిస్తున్నట్టు యూకే ప్రభుత్వం వెల్లడించింది. కోవిషీల్డ్ వేసుకున్న భారత ప్రయాణీకులకు యూకే ప్రభుత్వం క్వారెంటైన్ ఆంక్షలు విధించడంపై కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, శశిథరూర్ మండిపడుతున్నారు. ఆ దేశానికి చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌నే సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్(Covishield)పేరుతో ఉత్పత్తి చేస్తున్నప్పుడు..ఆ వ్యాక్సిన్‌ను ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు


యూకే వెళ్లాల్సిన భారతీయులు ప్రయాణానికి మూడ్రోజులు ముందుగా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలి. అక్కడికి చేరుకున్న తరువాత 2వ రోజు, 8 వరోజు కోవిడ్ పరీక్షలకు ముందుగానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ చేరుకోడానికి 48 గంటల ముందు ప్యాసెంజర్ లొకేటర్ ఫాం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ చేరుకున్న తరువాత ఇంట్లో గానీ లేదా మరెక్కడైనా పదిరోజుల పాటు క్వారెంటైన్(Quarantine)విధిగా పాటించాలి. 2వ రోజు, 8వ రోజు గానీ ఆ తరువాత గానీ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. 


Also read: Quad Meet: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని మోదీ భేటీ అక్టోబర్ 24న ఖరారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook