UK Wife Launches Rent My Hubby Site: బ్రిటన్‌కి చెందిన ఓ ఇల్లాలు తన భర్తను అద్దెకి పెట్టింది. భర్తను అద్దెకివ్వడమనగానే ఛీ ఛీ ఇదేం పని అనుకునేరు. ఆమె తన భర్తను అద్దెకిచ్చేది ఇంటి పనులు చేసిపెట్టడానికి మాత్రమే. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులతో ముగ్గురు పిల్లలున్న ఇంటిని నెట్టుకొచ్చేందుకు భర్తను అద్దెకు పెట్టింది. ఇందుకోసం రెంట్ మై హ్యాండీ హబ్బీ అనే సైట్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. అందులో తన భర్తను ఏయే పనులకు అద్దెకు ఇచ్చేది... ఎంత ఛార్జ్ చేసేది వంటి వివరాలను పేర్కొంది. ఇంతకీ ఆ మహిళ పేరు ఏంటంటే.. లారా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

41 ఏళ్ల లారాకు భర్త జేమ్స్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేమ్స్ గతంలో నైట్ షిఫ్ట్ జాబ్ చేసేవాడు. కొన్నేళ్ల క్రితం ఆ జాబ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత తనకిష్టమైన మెటార్ మెకానిక్స్ కోర్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఉద్యోగం లేకుండా కుటుంబాన్ని పోషించడం, చదువుకోవడం కష్టం కదా. ఈ క్రమంలోనే జేమ్స్ భార్య లారాకి రెంట్ మై హబ్బీ అనే ఐడియా వచ్చింది. తన భర్తను అద్దెకివ్వడం ద్వారా వచ్చే డబ్బులతో అటు ఇల్లు గడవడంతో పాటు ఇటు భర్త చదువు సాగుతుందని భావించింది.


'ఇంటికి సంబంధించిన అన్ని పనుల్లో జేమ్స్ పర్ఫెక్ట్. అతని స్కిల్స్‌ను ఎందుకు ఉపయోగించుకోకూడదు అనిపించింది. అందుకే రెంట్ మై హబ్బీ సైట్‌ను ప్రారంభించాను. ఈ కాలంలో చిన్న చిన్న ఇంటి పనులు చేసేందుకు వర్కర్స్ దొరకడం కష్టమైపోయింది. జేమ్స్‌ తన స్కిల్స్‌తో ఆ పనులను సులువుగా చేసిపెట్టగలడు. అందుకే అతన్ని అద్దెకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ కొంతమంది భర్తను అద్దెకివ్వడమంటే మరోలా ఆలోచిస్తున్నారు.అలాంటి ఉద్దేశం నాకు లేదు..' అని ఇటీవల ఓ సందర్భంలో లారా చెప్పుకొచ్చింది. 


చాలా సందర్భాల్లో ఇంటి పనులు భర్తలు చేసి పెడుతారని భార్యలు వేచి చూస్తుంటారని.. కానీ అదెప్పటికీ జరగదని.. ఆ ఆలోచనలో నుంచే 'రెంట్ మై హబ్బీ' ఐడియా పుట్టుకొచ్చిందని లారీ వెల్లడించింది. జేమ్స్‌ను అద్దెకిస్తున్నందుకు గాను సగటున 35 డాలర్లు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, దివ్యాంగులు, వృద్దులకు ఈ కపుల్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
 



Also Read: Acharya: టైటిలే కరెక్ట్ కాదు.. ఆయనతో ఐటెం సాంగా? ఆచార్యపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు!


Also Read: BJP Vijaya Sankalpa Sabha Live Updates: రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు..  సాయంత్రం విజయ సంకల్ప సభ..


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook