Russia Captures Kherson: పోర్టు సిటీ `ఖేర్సన్` రష్యా హస్తగతం.. కీవ్ స్వాధీనం దిశగా అడుగులు!
Russia Captures Kherson: ఉక్రెయిన్ లో మరో ప్రధాన నగరమైన ఖేర్సన్ను హస్తగతం చేసుకున్నాయి రష్యా బలగాలు. మరోవైపు రాజధాని కీవ్ పై పట్టుసాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది రష్యా.
Russia Captures Kherson: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. ఇరుదేశాల మధ్య భీకరపోరు జరుగుతోంది. తాజాగా పోర్టు సిటీ ఖేర్సన్ను రష్యా స్వాధీనం (Russia Captures Kherson) చేసుకుంది. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. నల్ల సముద్రం (Black Sea) వద్ద ఉక్రెయిన్‌కు వ్యూహాత్మకమైన పోర్ట్ సిటీ ఖేర్సన్ (Kherson). ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుని ఉక్రెయిన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది రష్యా.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పట్టుకోసం యత్నిస్తోంది రష్యా. అయితే అంతకంటే ముందు ఖార్కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. అందుకే ఆ ప్రాంతంపై బాంబుల మోత మోగిస్తోంది. ఈ రెండు నగరాలను కైవసం చేసుకుంటే మిగిలిన దేశంపై పట్టు వస్తుందని రష్యా ఆలోచిస్తోంది. తమ సైనికులు 498 మంది చనిపోయారని రష్యా రక్షణశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇండియన్స్ వెంటనే ఉక్రెయిన్ ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు రష్యా రక్షణ మంత్రి. వారు రష్యా సరిహద్దులకి వస్తే అక్కడి నుంచి సురక్షితంగా భారత్‌కు తరలిస్తామన్న హామీ ఇచ్చారు. కాని కీవ్, ఖార్కీవ్ నుంచి రష్యాకు వెళ్లే మార్గాలే కనిపించడం లేదు భారతీయులకు. ఇప్పటికే రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడి ఎలా చేరుకోవాలో అర్థం కావడం లేదు.
Also Read: Ukraine Crisis: రష్యాకు వ్యతిరేకంగా UNGAలో తీర్మానం ఆమోదం.. మరోసారి ఓటింగ్‌కు దూరంగా భారత్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి