అఫ్గనిస్థాన్‌ను (Afghanisthan) తాలిబన్లు (Taliban) ఆక్రమించిన తరువాత అక్కడ పరిస్థితులు ఎలా మారుతున్నయో అన్న భయం ప్రపంచ దేశాలల్లో ఉంది. ఇపుడు కొత్తగా ఏం జరిగిందంటే.. అఫ్ఘనిస్థాన్‌ కు చేరుకున్న ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌కు (Ukraine plane hijacked) గురయ్యింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాలిబన్ల ఆక్రమణ కారణంగా ఉక్రెయిన్‌ (Ukraine) తమ దేశ పౌరాలను తరలింపు ప్రక్రియ కోసం పత్యేక విమానాన్ని కాబుల్ (Kabul) విమానశ్రయానికి పంపింది. ఈ క్రమంలో కొంతమంది దుండగులు ఆయుధాలతో వచ్చి విమానాన్ని హైజాక్ చేయటమే కాకుండా దానిని ఇరాన్ దేశం (Iran) వైపు మళ్లించారు. 


Also Read: Tokyo Paralympics 2020: నేటి నుంచే టోక్యోలో పారాలింపిక్స్‌..రెండంకెల పతకాలే లక్ష్యంగా భారత్‌!



ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ (Ukraine’s Deputy Foreign Minister Yevgeny Yenin) మాట్లాడుతూ "గత ఆదివారం మా విమానం దేశ ప్రజల తరలింపు కోసం అఫ్గనిస్థాన్‌కి చేరింది. తరువాత కొంత మంది మా విమానాన్ని హైజాక్ చేసి,  ఇరాన్ కు (Iran) తరలించారు. నిజానికి విమానంలో ఉన్న వారు కూడా ఉక్రెయిన్ దేశ ప్రజలు కాదు.. మంగళవారం ఆచర్ననాత్మకంగా విమానం మా చేతుల్లోంచి చేజారిపోయింది. తరువాత 3 విమానలు కూడా మా ప్రజలను తీసుకురాలేకపోయాయి. ఎందుకంటే ఉక్రెయిన్ (Ukraine) ప్రజలు కాబుల్ విమానాశ్రయం చేరుకోలేకపోవటమే దానికి కారణం అని" రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్‌ (Russian News Agency TASS) తో పేర్కొన్నారు.


హైజాక్ కు గురై రెండు రోజులు కావచ్చిన ఇప్పటివరకి హైజాక్ చేసిన వారి వివరాలు, కారణాలు తెలియకపోవటం గమనార్హం. 


Also Read: Vaccine Slot Booking: వాట్సప్ నుంచి వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ ఎలాగో తెలుసా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook