Oscar Awards 2022: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజు రోజు మితిమీరుతుంది. యుద్ధం కారణంగా ఇరు దేశాల [ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధ ప్రభావం కేవలం ఇరు దేశాలపైనే కాకుండా ప్రపంచ దేశాలను ఇరకాటంలో పడేస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పలు ప్రపంచ సభలలో పాల్గొంటూ.. ప్రపంచ దేశాల సహాయం కోరుతున్నాడు. ఇటీవలే అమెరికా సహా పలు దేశాల చట్టసభలలో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఇపుడు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా జెలెన్ స్కీ ప్రసంగించనున్నట్లు సమాచారం . 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యాతో యుద్ధం కారణంగా అల్లాడిపోతున్న ఉక్రెయన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సాయం కోసం ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నారు. ఈ ఇందులో భాగంగానే ఆయన ఇటీవలే అమెరికా సహా పలు దేశాల చట్టసభలను ఉద్దేశిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. రష్యా చేస్తున్న భీకర దాడుల కారణంగా తాము ఎంత అల్లాడిపోతోంది వివరించారు. 


ఈ అనాలోచిత దాడులను ఆపేందుకు రష్యాపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన మరోసారి అంతర్జాతీయ సమాజం ముందుకు రానున్నారు. అంతర్జాతీయ సినీ వేడుక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలోను ఆయన ప్రసంగించనున్నారు. రష్యా చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటనున్నారు.


తన ప్రసంగానికి అనుమతించాలని ఈ పాటికే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ప్రతినిధులతో జెలెన్‌స్కీ చర్చించినట్లు సమాచారం. ఈ రోజు జరిగే ఆస్కార్ పురస్కార ప్రదానోత్సవంలో జెలెన్‌స్కీ ప్రసంగం చేయనున్నారు. అయితే ఆయన ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతారా..? లేక రికార్డెడ్‌ ప్రసంగాన్ని ప్రదర్శిస్తారా అనే దానిపై ఇంకా సమాచారం అందలేదు. 


అటు అవార్డులను ప్రధానం చేస్తున్న అకాడమీ కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది.  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. పలు కామెడీ షోలు, సినిమాల్లో నటించి జనాన్ని మెప్పించిన ఆయన.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 2019లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం సృష్టించారు.


Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ హాఫ్ సెంచరీ.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు!


Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook