180 మంది ప్రయాణికులతో కూలిపోయిన విమానం
అమెరికా ఎప్పుడు, ఎటువైపు నుంచి విరుచుకుపడుతుందోనని భయాందోళనలకు గురవుతున్న ఇరాన్‌లో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమిని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన బోయింగ్ 737 విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపట్లోనే టెహ్రాన్‌లో కుప్పకూలింది.
టెహ్రాన్: అమెరికా ఎప్పుడు, ఎటువైపు నుంచి విరుచుకుపడుతుందోనని భయాందోళనలకు గురవుతున్న ఇరాన్‌లో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమిని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన బోయింగ్ 737 విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపట్లోనే టెహ్రాన్‌లో కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 180 మంది ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ బోయింగ్ 737 విమానంగా గుర్తించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.