Afghanistan: ఆప్ఘనిస్తాన్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆప్ఘన్ సైన్యానికి తాలిబన్ల మధ్య యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆప్ఘన్‌లో పరిణామాల పట్ల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)లో పరిణామాలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్నాయి. దేశ సైనిక బలగాలకు, తాలిబన్లకు గత కొద్దిరోజులుగా యుద్ధం జరుగుతోంది. ఇరువురి మధ్య జరుగుతున్న ఘర్షణలో ఉగ్రవాదులతో పాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.ఇప్పటికే గత 24 గంటల్లో 40 మంది సామాన్య పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరో వందమందికి గాయాలైనట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది. 


ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు 2001 డిసెంబర్‌లో ప్రవేశించాయి.బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను 10 వేలమంది సైనికులతో స్థావరంగా మార్చుకున్నాయి.ఇరవయ్యేళ్ల యుద్ధం తరువాత అమెరికా తన బలగాల్ని ఆప్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది. తరువాత ఇతర దేశాల బలగాలు కూడా వైదొలగాయి. దాంతో మరోసారి తాలిబన్లు విస్తరించడం ప్రారంభించారు. ఆప్ఘనిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్ని తమ నియంత్రణలో తెచ్చుకున్నారు. మరోసారి ఆ దేశంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కాందహార్‌లో(Kandahar) తాలిబన్లు విరుచుకుపడ్డారు. రాకెట్లతో దాడులు చేశారు. అటు ఆప్ఘన్ బలగాలు కూడా పెద్దఎత్తున తాలిబన్ల (Talibans)స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఈ ఇరువురి దాడుల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి(UNO)ఆందోళన వ్యక్తం చేసింది. 


Also read: ఆందోళన కల్గిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు, చైనాలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook