Donald Trump Twitter Account Restored: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను మళ్లీ పునరుద్ధరణ అయింది. ట్రంప్ తిరిగి రావడానికి సంబంధించి ట్విట్టర్‌లో ఎలన్ మస్క్ పోల్ నిర్వహించగా.. ఈ పోల్‌లో ఎక్కువ మంది ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలని చెప్పారు. 'మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌ను తిరిగి నియమించాలా..?' అని అడిగి.. అవును లేదా కాదు అనే ఆప్షన్‌ను ఉంచాడు. పోల్ ఫలితాలను ప్రకటిస్తూ ఎలోన్ మస్క్ ఖాతా పునరుద్ధిరిస్తున్నట్లు ప్రకటించారు. 51.8 శాతం మంది ప్రజలు అవుననే సమాధానమిచ్చారని ట్రంప్ ఖాతా పునరుద్ధరణకు మద్దతు తెలిపారని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ సమయంలో ఎలోన్ మస్క్ ఒక లాటిన్ వాక్యాన్ని రాశాడు. దాని అర్థం.. 'ప్రజల స్వరం, దేవుని స్వరం'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డొనాల్డ్ ట్రంప్ ఖాతా మరోసారి ట్విట్టర్‌లో కనిపించడం ప్రారంభించింది. అతని ఖాతా ID @realDonaldTrump. డొనాల్డ్ ట్రంప్ పాత ట్వీట్లన్నిటితో ఖాతా పునరుద్ధరించారు. ఖాతా తిరిగి ఓపెన్ చేయడంతో ట్రంప్‌ను ఫాలోవర్స్ సంఖ్యను రీసెట్ చేశారు. ట్రంప్ ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చిన వెంటనే పది లక్షల మందికి పైగా ఫాలో అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ అకౌంట్ సస్పెండ్ కావడంతో ఆయన ఖాతాలో ఇప్పటికీ ‘45వ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా’ అని రాసి ఉంది.


2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. ముఖ్యంగా క్యాపిటల్​ భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. విధ్వంసం సృష్టించారు. వారి రెచ్చగొట్టే విధంగా ట్రంప్​ వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య.. ట్రంప్​ ఖాతాలను తొలగిస్తున్నట్టు.. ఫేస్​బుక్​, ట్విట్టర్​ ప్రకటించాయి.


జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ హిల్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. అమెరికాలో ఎన్నికల ఫలితాలు వచ్చి జో బిడెన్‌కు మెజారిటీ వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎన్నికల్లో రిగ్గింగ్ గురించి ట్రంప్ మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. అంతకుముందు అధ్యక్ష ఎన్నికల్లో హింసాకాండ కూడా చెలరేగింది. దీనికి ట్రంప్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ట్రంప్ ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రకటించాయి.


ట్రంప్ మళ్లీ ట్విట్టర్‌లోకి వస్తారా..?


డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించినా.. అయితే ట్రంప్ ప్లాట్‌ఫారమ్‌కు తిరిగి వస్తారా అనేది ప్రశ్నగా మారింది. తన ఖాతాను పునరుద్ధరించినా.. తాను ట్విట్టర్‌లోకి తిరిగి రానని ట్రంప్ గతంలోనే చెప్పారు. డొనాల్డ్ ట్రంప్‌కు ట్రూత్ సోషల్ అనే చిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉంది. ట్విట్టర్ అతన్ని బ్లాక్ చేసినప్పటి నుంచి అతను దానిని ఉపయోగిస్తున్నాడు. లాస్ వెగాస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ఎలోన్ మస్క్ పోల్ గురించి తనకు తెలుసునని.. ట్విట్టర్ యజమాని అయినందుకు ప్రశంసించారు. అయితే ట్విట్టర్‌లోకి తిరిగి రావడానికి నిరాకరించాడు.  


Also Read: IND vs NZ: ఐపీఎల్లో సత్తా చాటిన ఈ ప్లేయర్ టీ20ల్లో అరంగేట్రానికి రెడీ   


Also Read: Ind Vs Nz T20: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 కూడా రద్దు..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook