Donald Trump: ట్రంప్ లైంగికంగా వేదించాడు.. అమెరికన్ లేడీ జర్నలిస్ట్ సంచలనం ఆరోపణ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మరోసారి అధికారం చేజిక్కించుకోలేక పోయారు. అయితే ఇటీవల యూఎస్ మహిళ జర్నలిస్ట్ జీన్ కారోల్ 1996 లో డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో పరిపాలనపై తనదైన ముద్ర వేసేందుకు గాను ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని అమెరికన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కొని మరోసారి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన విషయం తెల్సిందే. ఓడి పోయిన తర్వాత అధ్యక్ష భవనం ఖాళీ చేసిన సమయంలో ట్రంప్ చేసిన పనులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ పై ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా కేసులు నమోదు అవుతున్నాయి.. విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై మరో కొత్త ఆరోపణ వచ్చింది. ఈసారి ట్రంప్ పై మహిళ జర్నలిస్ట్ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసింది.
యూఎస్ మహిళ జర్నలిస్ట్ జీన్ కారోల్ 1996 లో డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది. యూఎస్ ఫెడరల్ కోర్ట్ లో ఈ కేసుకు సంబంధించిన విచారణ మొదలు అయ్యింది. 1996 లో ట్రంప్ ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్ లో నన్ను కలిశారు. ఆ సమయంలో మరో మహిళకు లో దుస్తులను బహుమానంగా ఇవ్వడంపై ఆయన సలహా అడిగాడు. ట్రంప్ సరదాగా అన్నాడేమో అనుకున్నారు. ఆ తర్వాత స్టోర్ లోని ఆరో అంతస్తులోకి ట్రంప్ నన్ను తీసుకు వెళ్లాడు. ఆ సమయంలో ఆ సెక్షన్ లో ఎవరు లేరు. దుస్తులు మార్చుకునే గదిలోకి నేను వెళ్లిన సమయంలో ట్రంప్ వచ్చి తలుపులు వేసి గోడకు బలంగా తోశాడు. ఆ సమయంలో నా తలకు బలంగా దెబ్బ కూడా తగిలింది. నన్ను లైంగికంగా వేదించాడు. నేను ఆ సమయంలో ఫిర్యాదు చేయాలని అనుకోలేదు. ఎందుకంటే నేను అత్యాచార బాధితురాలిగా నిలవాలని నేను అనుకోలేదు అంటూ ఆమె పేర్కొంది.
Also Read: Bandi Sanjay: పోలింగ్ బాక్స్ బద్దలయ్యేలా బీజేపీకి ఓటేయ్యండి.. కర్ణాటక ఎన్నికల్లో బండి సంజయ్ పిలుపు
ప్రస్తుతం ఈకేసును 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ ధర్మాసనంలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ కేసు పై ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. రాజకీయ కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా ఆమె తన పుస్తకంలో ఈ విషయాన్ని రాసుకుని దాన్ని అమ్ముకునేందుకు తనపై ఇలాంటి విమర్శలు చేస్తుంది అంటూ ట్రంప్ కౌంటర్ ఇచ్చాడు. తన పరువు పోయే విధంగా లైగింక వేదింపుల కేసును పెట్టినందుకు గాను ఆమెపై పరువు నష్టం కేసు వేయబోతున్నట్లుగా కూడా ట్రంప్ పేర్కొన్నాడు. ఈ కేసులో దోషిగా తేలితే అమెరికా అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేసే వీలు ఉండక పోవచ్చు అంటున్నారు. మొత్తానికి ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. ఇది ఆయనకు రాజకీయంగా దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: RR vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. స్టార్ ప్లేయర్ ఔట్! తుది జట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook