అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద అమెరికా మాజీ స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైన మరియు గందరగోళంగా ఉండే  అంశాలను ప్రెసిడెంట్ ట్వీట్ చేయడం వలన ప్రజలు అయోమయంలో పడతారని ఆయన అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయ అంశాలు కూడా ఇలాంటి పనుల వలన అయోమయంలో పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ట్రంప్ గతంలో డొమస్టిక్, ఫారిన్ పాలసీ విషయంతో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుడిని తూర్పారపడుతూ చేసిన ట్వీట్లు కొంతవరకు ప్రజల్లో, మీడియాలో కూడా ఆసక్తి రేపిన విషయం తెలిసిందే.


అయితే ఇలాంటి ట్వీట్లు చేసి ట్రంప్ ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని, వాటి వలన సమయం వృధా కావడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రెసిడెంట్ దేశాన్ని ఏలుతుంటే.. స్టేట్ సెక్రటరీలకు వారు చేసే పనులు మరింత కష్టతరం అవుతాయని కేర్రీ తెలిపారు. ప్రస్తుతం అమెరికాకి రెక్స్ టెల్లిర్‌సన్ స్టేట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆయన మీద కూడా ట్రంప్ ఒకసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.