US Elections 2024: ఉద్యోగం కోసమో, చదువుల కోసమో దాదాపు అన్నిదేశాలు అగ్రరాజ్యం అమెరికా వలసపోతుంటాయి. అందుకే అమెరికాకు ఎన్నికలంటే అన్ని దేశాల్లో ఆసక్తి ఉంటుంది. ప్రతి దేశం ఎదురుచూసే ఆమెరికా హెచ్ 1 బి వీసాల విషయంలో ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందోననే సందేహం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే అధ్యక్ష పదవికై పోటీ పడే అభ్యర్ధుల విషయంలో పార్టీల్లో అభ్యర్దిత్వ పోటీ నెలకొంది. ఈసారి రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయులు పోటీ పడుతున్నారు. ఒకరు వివేక్ రామస్వామి కాగా మరొకరు నిక్కీ హేలి. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై వివేక్ రామస్వామి చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. యూఎస్ క్యాపిటల్‌పై దాడులకు పాల్పడిన ట్రంప్ మద్దతుదారులకు క్షమాభిక్ష పెడతానని ప్రకటించారు. అంతేకాకుండా ఫెడరల్, ఎఫ్బీఐ ఉద్యోగుల్ని తగ్గిస్తానన్నారు.


ఇప్పుడు కొత్తగా భారతీయులకు షాక్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో గెలిస్తే వీసా వ్యవస్థలో మార్పులు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. హెచ్1 బీ వీసాలను ముగించేందుకు నిర్ణయించున్నట్టు చెప్పారు. అమెరికా వెళ్లేందుకు గతంలో 29 సార్లు వీసాలు ఉపయోగించిన వివేకా రామస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లాటరీ వ్యవస్థ స్థానంలో మెరిటోక్రాటిక్ ప్రవేశం కల్పిస్తానన్నారు. 


భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఉపయోగించే హెచ్ 1 బీ వీసా వ్యవస్థ మంచిది కాదని వివేక్ రామస్వామి తెలిపారు. హెచ్ 1 బీ వీసా వల్ల సదరు వ్యక్తిని స్పాన్సర్ చేసిన కంపెనీకి మాత్రమే ప్రయోజనం కలుగుతుందన్నారు. అమెరికాలో పుట్టినా..పత్రాల్ని లేని వలసదారుల పిల్లల్ని బహిష్కరిస్తానన్నారు. ప్రతి యేటా అమెరికా 65 వేల హెచ్ 1 బీ వీసాలు అందిస్తోంది. అమెరికా జారీ చేసే హెచ్ 1 బీ వీసాల్లో మూడు వంతులు భారతీయ నిపుణులకే అందుతున్నాయి. ఇప్పుడు వివేక్ రామస్వామి ఈ వీసాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.


Also read: Libya Floods 2023: ప్రకృతి విలయ తాండవం..వరద ధాటికి వేలాది మంది దుర్మరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook