Joe Biden Tests Covid Positive : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా బారినపడ్డారు. కోవిడ్ ఐసోలేషన్ నుంచి బయటకొచ్చిన 3 రోజులకే బైడెన్‌కు మళ్లీ కరోనా సోకింది. దీంతో బైడెన్ మరోసారి ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడింది. బైడెన్‌కు కరోనా సోకినప్పటికీ ఎమర్జెన్సీ లక్షణాలేమీ లేవని వైట్ హౌస్ ఫిజీషియన్ డా.కెవిన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటలకు బైడెన్ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. మరికొద్దిరోజులు ఇంటి నుంచే పనిచేయబోతున్నానని తెలిపారు. బైడెన్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.


జూలై 21న జో బైడెన్ తొలిసారి కరోనా బారినపడ్డారు. యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్లోవిడ్‌తో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. మంగళవారం, బుధవారం (జూలై 26,27) నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగటివ్‌గా తేలింది. దీంతో ఐసోలేషన్‌ నుంచి బయటకొచ్చేందుకు క్లియరెన్స్ లభించింది. కానీ ఆ తర్వాత 3 రోజులకే మళ్లీ కరోనా బారినపడ్డారు. పాక్స్లోవిడ్‌ ట్రీట్‌మెంట్ తర్వాత 5 నుంచి 8 శాతం మంది మళ్లీ కరోనా బారినపడుతున్నట్లు డేటాను పరిశీలిస్తే అర్థమవుతోందని వైట్ హౌస్ కోవిడ్ 19 కోఆర్డినేటర్ డా.ఆశిష్ ఝా తెలిపారు. సీడీసీ (Centers for Disease Control and Prevention) ప్రకారం రెండోసారి కోవిడ్ బారినపడినవారు కనీసం ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. 


Also Read: Komatireddy:మునుగోడులో కోమటిరెడ్డి ఒంటరయ్యారా? అందుకే రాజీనామాకు భయపడుతున్నారా?


Also Read: HYD MMTS: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ఇవాళ 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు... రద్దయిన రైళ్ల వివరాలివే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook