Ukraine Dispute: అమెరికా రష్యా దేశాల మధ్య మరోసారి వివాదం రాజుకుంటోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కొత్త పరిణామాలకు దారి తీస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్రరాజ్యం అమెరికా, రష్యా దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు దారీతీసేలా కన్పిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు ఉక్రెయిన్ వేదిక కానుంది. ఉక్రెయిన్ తూర్పు సరిహద్దు వెంట లక్షా 75 వేలమంది సైనికులు, యుద్ధట్యాంకుల్ని రష్యా మొహరించడంతో అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్(Ukraine)తూర్పు ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోనుందనేది అమెరికా నిఘా నివేదికల సారాంశం. ఉక్రెయిన్ దేశపు సార్వభౌమత్వం, సమగ్రతల్ని దెబ్బతీయాలనే రష్యా దూకుడుకు అంతర్జాతీయ ఆంక్షలతో దీటైన సమాధానమిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వర్చువల్ భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల నేతలు ఇదే అంశాపై చాలాసేపు చర్చించారు. 


వాషింగ్టన్‌లో వైట్‌హౌస్ నుంచి జో బిడెన్(Joe Biden), బ్లాక్ సీ తీరపట్టణమైన సోచీలోని నివాసం నుంచి పుతిన్ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌ను చేర్చుకోవాలనే ఆలోచన మానుకోవాలని..అమెరికా ఈ విషయంపై చట్టబద్ధ హామీ ఇవ్వాలని పుతిన్(Putin)కోరారు.ఇరుదేశాల మధ్య చర్చల్లో అణ్వాయుధాల నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, ఇరాన్ అణు కార్యక్రమాలు సైతం చర్చల్లో భాగం కావచ్చని సమాచారం. 


Also read; NASA: నాసా కొత్త అస్ట్రోనాట్ టీంలో భారత సంతతి వ్యక్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి