Video of Massive Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం 100 మందిని బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఒక్క కెంటకీ (Kentucky) రాష్ట్రంలోనే 70 మంది వరకు మృతి చెందారు. అనధికారికంగా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కెంటకీలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అమెరికా చరిత్రలో సంభవించిన అతిపెద్ద విపత్తుల్లో ఇదీ ఒకటిగా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెంటకీలో టోర్నడోల (Tornado) ధాటికి మేఫీల్డ్‌లో పట్టణంలోనే ఎక్కువమంది మృతి చెందారు. ఇక్కడి చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. స్థానిక క్యాండిల్ ఫ్యాక్టరీ కూలిపోవడంతో అందులో ఉన్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మొత్తం 110 మంది కార్మికులకు గాను 40 మందిని రక్షించగలిగినట్లు కెంటకీ గవర్నర్ వెల్లడించారు. ఎడ్వర్డ్స్ విల్లేలోని అమెజాన్ గోదాం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపారు. తన జీవితంలోనే ఇంత పెను విధ్వంసాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.


అమెరికా (America) చరిత్రలో 1925 తర్వాత ఇంత భారీ స్థాయిలో టోర్నడోలు విరుచుకుపడటం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. టోర్నడోల (Tornadoes) బీభత్సానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. కొన్ని వీడియోల్లో... ఎటు చూసినా కూలిపోయిన ఇళ్లు, శిథిలాలు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని వీడియోల్లో ఉవ్వెత్తున విరుచుకుపడుతున్న టోర్నడో దృశ్యాలు కనిపిస్తున్నాయి. టోర్నడోల ధాటికి అతలాకుతలమైన ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




Also Read: ఒక్కో సినిమాకు రజనీ కాంత్‌ ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా?.. ఫ్లాప్ అయితే మాత్రం!! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook