లండన్: ఇండియాలో వివిధ జాతీయ బ్యాంకుల వద్ద సుమారు రూ.9000 కోట్లకుపైగా రుణం తీసుకుని ఆ రుణాన్ని తిరిగి చెల్లించకుండానే లండన్‌కు పారిపోయిన వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా ఇవాళ లండన్‌లోని ఓవల్ స్టేడియం వద్ద ప్రత్యక్షమయ్యాడు. భారత్ నుంచి పారిపోయినప్పటి నుంచి లండన్‌లోనే తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం లండన్‌లోని వెస్ట్ మిన్‌స్ట్రర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటికొచ్చిన విజయ్ మాల్యా నేడు ఓవల్ స్టేడియం వేదికగా జరగనున్న ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు అక్కడికి చేరుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"178726","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఓవల్ స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్ మాల్యాను మీడియా ప్రశ్నించగా.. తాను మ్యాచ్ చూసేందుకు వచ్చానని చెప్పి స్టేడియం లోపలకు వెళ్లిపోయాడు.