Indian,Pak,Bangla students are being attacked in Kyrgyzstan: కిర్గిస్థాన్ లో అల్లరి మూకలు రెచ్చిపోయారు. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కు చెందని వారిపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం మే 13 వ తేదీన ఈజిప్ట్ దేశానికి చెందిన స్టూడెంట్లు, స్థానిక విద్యార్థులు మధ్య గొడవలు జరిగాయి. అది కాస్త భీకర దాడులు చేసుకొవడం వరకు వెళ్లింది.  కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌ లో ఈ గొడవులు జరిగినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. అల్లరి మూకలు స్థానికంగా ఉన్న హస్టల్ లు, విద్యార్థులు ఉంటున్న ప్రదేశాలకు వెళ్లి కాలితోతన్నుతూ, కొడుతున్నట్లు కూడా అక్కడి విద్యార్థులు వాపోతున్నారు. విదేశీయులే టార్గెట్ గా స్థానిక అల్లరి మూకలు ఈ విధ్వంసానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బిష్కెక్‌ లో చెలరేగిన మూకదాడిలో ముగ్గురు పాక్‌ కు చెందిన విద్యార్థులు మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చాలా మంది ఇతర దేశానికి చెందని వారిపైన అత్యచారాలకు కూడా పాల్పడుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలా ఉండగా.. కిర్గిస్థాన్ కు మన దేశానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తొంది. అక్కడ ఎంబీబీఎస్ చదవడానికి ఎక్కువ మంది వెళ్తుంటారు. అక్కడ ఇతర దేశాలకంటే, మెడిసిన్ చదువులు తక్కువ ఖర్చు అవుతుందని, అందుకు అక్కడికి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఘటనపై అక్కడున్న విద్యార్థులు భారత్ లో ఉన్న తమ తల్లిదండ్రులకు తమ గొడును చెప్పుకుంటున్నారు. అదే విధంగా అక్కడున్న ఎంబసీ అధికారులకు కూడా తమ బాధలను చెప్పుకుంటున్నారు. తమపిల్లలను సెఫ్టీగా తిరిగి రప్పించే పనులు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు భారత్ విదేశాంక శాఖకు మెయిల్స్, ఫోన్ లు చేస్తున్నారు.


ఇక దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి  ఎంబీసీ అధికారులతో నిరంతరం టచ్ లో ఉండాలని సూచించారు. తమ హస్టల్ లు, నివాస సముదాయాల నుంచి బైటకు వెళ్లవద్దని కూడా సూచించారు. కిర్గిస్థాన్ లోని భారత ఎంబీసీ అధికారులతో మాట్లాడుతున్నామని, తొందరలోనే పరిస్థితులున్న చక్కబడతాయని జైశంకర్ భరోసాను ఇస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి’అంటూ హెల్ప్‌లైన్ నంబర్‌ 0555710041ను షేర్ చేసింది. ఈ నంబర్ నిరంతం అందుబాటులో ఉంటుందని చెప్పారు.


Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?


కిర్గిస్థాన్ లో సుమారు 15 వేల మంది భారత్ విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పటి దాక బిష్కెక్‌లో మెడికల్ యూనివర్సిటీల్లోని కొన్ని హాస్టళ్లు, ప్రయివేట్ రెసిడెన్సుల్లో ఇతర దేశాలకు చెందిన విద్యార్థులపై దాడులు జరిగాయి.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్థులనే టార్గెట్  చేసుకుంటున్నట్లు తెలుస్తొంది. పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలైనట్టు తెలుస్తొంది.  కొందరు సోషల్ మీడియాలలో.. పాక్‌కు చెందిన విద్యార్థులపై అత్యాచారం చేసి చంపేసినట్టు పోస్టులు పెడుతున్నారు. దీనిపైన తమకు ఎలాంటి నివేదికలు రాలేదని పాక్ ఎంబసీ పేర్కొంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter