అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత పర్యటనను మర్చిపోలేకపోతున్నారు.  భారత పర్యటన తన జీవితంలో చెరగని ముద్ర వేసిందని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే భారత్ లో పర్యటించడం చాలా సంతృప్తినిచ్చిందని చెబుతున్నారు.  
 
నిన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సౌత్ కరోలినాలోని ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా భారత పర్యటన విశేషాలను వారితో పంచుకున్నారు.  ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీని దేశ ప్రజలు అంతా ప్రేమిస్తున్నారని తెలిపారు. అంతే కాదు  గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో భారీ జనసందోహం ఉన్న బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత.. ఇక ఎక్కడా భారీ జనసందోహం గురించి ఆలోచించడం లేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్!


సాధారణంగా తాను బహిరంగ నిర్వహిస్తే 60 వేల వరకు జనం వస్తారన్నారు. కానీ భారత్ లో మాత్రం లక్షా 50 వేల మంది వచ్చారన్నారు. అలా భారీగా జనం రావడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని చెప్పారు. భారత ప్రజలకు గొప్ప నాయకుడు ఉన్నారని .. వాళ్లు తమ నాయకున్ని ప్రేమిస్తున్నారని ట్రంప్ తెలిపారు.