Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఒక్కొక్క ప్రాంతాన్నీ తాలిబన్లు ఆక్రమించుకుంటున్నారు. ఆప్ఘన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)మరోసారి తాలిబన్ల స్వాధీనంలో వెళ్లనుందా అంటే పరిస్థితి అలాగే అన్పిస్తోంది. గత కొద్దిరోజులుగా తాలిబన్లు (Talibans)దేశంలో తమ పట్టు పెంచుకుంటున్నారు. నెమ్మదిగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు. అటు ఆఫ్ఘన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య నిరంతర ఘర్షణతో దేశంలో యుద్థ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడున్న భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు తాలిబన్లు మజర్ ఎ షరీఫ్ నగరం వైపుకు దూసుకొస్తున్నట్టు తెలియడంతో..కేంద్ర ప్రభుత్వం(Central government)హెచ్చరికలు జారీ చేసింది. ఆప్ఘన్‌లో ఉన్న భారతీయులు తక్షణం ఇండియాకు రావాలని పిలుపునిచ్చింది. అక్కడున్న దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. సిబ్బందిని ప్రత్యేక విమానంలో ఇండియాకు రప్పించింది.


మజర్ ఎ షరీఫ్ నుంచి ఢిల్లీకు ప్రత్యేక విమానం వస్తోందని..చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారతీయులంతా వెంటనే బయల్దేరాలని, ఎవరికీ భద్రత లేదని భారత రాయబార కార్యాలయం (Indian Embassy)తెలిపింది. ఆప్ఘన్‌లో హింస పెరిగితే విమాన సర్వీసుల్ని రద్దు చేస్తామ...ఆలోగా భారతీయులంతా ఇండియాకు తిరిగి రావాలని సూచించింది. ప్రస్తుతం  ఆ దేశంలో 15 వందల వరకూ ఇండియన్స్ ఉన్నారు. విమాన సర్వీసులు రద్దయ్యేలోగా ఇండియాకు తిరిగి రావాలని అక్కడున్న భారతీయుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆప్ఘన్- తాలిబన్ల (Afghan-Taliban War)మధ్య ఘర్షణలో ఇప్పటికే సాధారణ పౌరులు చాలామంది చనిపోతున్నారు. 


Also read: బీ అలర్ట్: భయపెడుతున్న మరోని కొత్త వైరస్‌..! డెత్‌ రేట్‌ 88 శాతం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook