మనం వేగవంత ప్రయాణం కోసం విమానాన్ని ఆశ్రయిస్తాం. సాధారణంగా ఏ విమానమైనా గంటకు 500 నుంచి 1000 ప్రయాణిస్తుంది. మహా అయితే 1500 కి.మీ వేగంతో నడుస్తుంది. విమానం స్పీడ్ కు రైలు ఏమాత్రం సరిపోదు..అయితే అది గతం ఇప్పుడు ఏకంగా విమానం కంటే పదిరెట్ల వాయువేగంతో హైపర్ సోనిక్ స్లెడ్ వచ్చేసింది. రైలు పట్టాలపై దూసుకెళ్లే ఈ వాహనం  గంటకు ఏకంగా 10,620.06 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్షణ అవసరాల కోసం అగ్రరాజ్యం అమెరికా ఎయిర్ ఫోర్స్  'హైపర్ సోనిక్ స్లెడ్' సాంకేతికతను అభివృద్ధి చేసింది. న్యూమెక్సికోలోని హాలోమ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో 10 మైళ్లున్న ట్రాక్ పై ఈ పరీక్షను అమెరికా వాయుసేన విజయవంతంగా చేపట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను అమెరికా వాయుసేన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఓరా అనిపించే ఈ సీన్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి.