Chris Gayle Thanks India: భారత ప్రజలకు, PM Modiకి ధన్యవాదాలు తెలిపిన క్రిస్ గేల్
West Indies Cricketer Chris Gayle Thanks India : ప్రస్తుతం కొన్ని దేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుండగా, భారత్ లాంటి అగ్రదేశాలు సమర్థవంతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా భారత్ ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ మోతాదులను పంపుతూ విపత్కర పరిస్థితులలో తమ వంతు పాత్రను పోషిస్తుంది.
COVID19 Vaccines: కరోనా వైరస్ గత ఏడాది ప్రపంచ దేశాలను వణికించింది. ప్రస్తుతం కొన్ని దేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుండగా, భారత్ లాంటి అగ్రదేశాలు సమర్థవంతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా భారత్ ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ మోతాదులను పంపుతూ విపత్కర పరిస్థితులలో తమ వంతు పాత్రను పోషిస్తుంది.
జమైకా దేశానికి సైతం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల మోతాదులు పంపించింది. జమైకా ప్రజలు, అధికారులు భారత్ అందించిన సాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ సైతం స్పందించాడు. తమకు సాయం చేసిన భారతదేశంపై Chris Gayle ప్రశంసల జల్లులు కురిపించాడు. కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న దేశాలలో భారత్ ఒకటి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల పేర్కొంది.
Also Read: India vs England ODI Series: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు Team Indiaను ప్రకటించిన బీసీసీఐ
‘భారత దేశానికి, ప్రజలందరికీ ధన్యవాదాలు. మా దేశానికి కరోనా వ్యాక్సిన్ అందించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. కోవిడ్ వ్యాక్సిన్ (COVID-19 Vaccine) అందించి మా దేశానికి చాలా సాయం చేశారు. త్వరలోనే నేను భారత పర్యటనకు రానున్నానంటూ’ వీడియో సందేశం విడుదల చేశాడు. జాతీయ మీడియా ఏఎన్‌ఐ ఈ వీడియోను పోస్ట్ చేసింది.
Also Read: Yuvraj Singh Sixes: ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ 6, 6, 6, 0, 6తో వీర విహారం, Watch Video
కాగా, జనవరి నెలలో భారత్ తొలి దశలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా టీకాలు తొలి డోసు ఇచ్చింది. గత నెలలో రెండో దఫా కరోనా టీకాల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. అదే సమయంలో ఇతర దేశాలకు సైతం కోవిడ్-19 వ్యాక్సిన్లు అందిస్తూ భారతదేశం స్నేహహస్తం అందిస్తున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook