Tiger Team: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన అణ్వాయుధ దాడితో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. నిజంగా పుతిన్..అన్నంతపని చేస్తే ఏం చేయాలనే విషయంపై అమెరికా టీమ్ వ్యూహం ఎలా ఉండనుంది. ఏం చేయబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉక్రెయిన్‌పై ఊహించింది జరగకపోవడంతో రష్టా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆవేశానికి లోనయ్యారు. అణుదాడుల వంటి దారుణమైన చర్యలకు దిగవచ్చని తెలుస్తోంది. ఈ అణుదాడుల్ని దృష్టిలో ఉంచుకుని..అమెరికా టైగర్ టీమ్ అప్రమత్తమైంది. ఒకవేళ పుతిన్..రసాయన ఆయుధాలు లేదా పరమాణు దాడి చేస్తే అమెరికా ప్రతిచర్య ఎలా ఉండాలనే విషయాన్ని నిర్ణయించే బాధ్యతను జో బిడెన్ ప్రభుత్వం..టైగర్ టీమ్‌కు అప్పగించింది. 


టైగర్ టీమ్ అంటే ఏంటి


న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, టైగర్ టీమ్‌లో జాతీయ భద్రతా అధికారి కూడా ఉన్నారు. ఇటువంటి టీమ్ ఉనికిలో రావడమంటే.. పుతిన్ ఉక్రెయిన్‌పై అణుదాడి లేదా రసాయన దాడులు జరపవచ్చనే విషయాన్ని తోసిపుచ్చలేమని తెలుస్తోంది. అమెరికా టైగర్ టీమ్‌ను ఫిబ్రవరి 28న ఏర్పాటు చేసింది. అంటే యుద్ధం ప్రారంభమైన సరిగ్గా నాలుగురోజుల తరువాత. అప్పట్నించి ఈ టైగర్ టీమ్ వారానికి మూడుసార్లు భేటీ జరుపుతోంది. అంటే అమెరికా అప్పుడే ఈ విషయాన్ని అంటే పరమాణు దాడి విషయాన్ని శంకించిందా..


మోల్దోవా, జార్జియా వంటి పొరుగు దేశాలపై కూడా రష్యా దాడి చేయనుందా అనే విషయంపై కూడా టైగర్ టీమ్ దృష్టి సారించింది. ఒకవేళ అదే జరిగితే..యూపర్ దేశాల్లో ఉత్పన్నమయ్యే శరణార్జుల సమస్యను ఎలా ఎదుర్కోవాలనేది చర్చించింది. పరమాణు దాడులపై పుతిన్ పదే పదే హెచ్చరిస్తున్న కొద్దీ..టైగర్ టీమ్‌లో పని ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతోంది. రష్టా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పరమాణు దాడి హెచ్చరిక చేయడం మరింత ఆందోళన కల్గిస్తోంది. 


అటు యూఎస్ అంచనా ప్రకారం పుతిన్ నాలుగు మార్గాలు అనుసరించే అవకాశముంది. రాజకీయంగా ఒడంబడిక చేసే ప్రయత్నం, ఉక్రెయిన్ నగరాలపై దాడులు, బాంబులు ఉధృతం చేయడం, పశ్చిమ తీరాన సైబర్ దాడులకు ప్రయత్నించడం చేయవచ్చు. చివరిగా ఒత్తిడి తగ్గించేందుకు, ప్రపంచాన్ని భయపెట్టేందుకు పరమాణు ఆయుధాల్ని ప్రయోగించడం చేయవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు ఊహించిన విజయం దక్కలేదు. 


Also read: Elon Musk Dance Video: టెస్లా మెగా ఈవెంట్ లో డ్యాన్స్ చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook