'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. చాలా దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశంలోనూ లాక్ డౌన్ రెండుసార్లు పొడగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో దాదాపు 45 రోజుల నుంచి జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఫలితంగా ఇంటర్నెట్ వాడకం పెరిగింది. అందులోనూ సామాజిక మాధ్యమాలన విపరీతంగా ఉపయోగిస్తున్నారు.  ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో కరోనా మహమ్మారికి సంబంధించి  విపరీతమైన వార్తలు కూడా పంపిస్తున్నారు.


ఇందులో కొన్ని నమ్మశక్యం లేని వార్తలు కూడా ఉంటున్నాయి. నకిలీ వార్తలు, ఫేక్ వార్తలు చాలా వరకు ఉంటున్నాయి. అసలు వార్తలతోపాటు ఫేక్, నకిలీకి సంబంధించిన మెసేజ్‌లు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో జనంలో ఏవి అసలు వార్తలో ఏవి నకిలీవో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. పైగా అసలు వార్తలు అనుకుని చాలా మంది తెలియకుండానే ఫేక్ వార్తలను ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఫేక్ వార్తలకు చెక్ పెట్టడానికి ప్రసిద్ధ సామాజిక మాద్యమం వాట్సాప్ ముందుకొచ్చింది. నకిలీ వార్తలను వినియోగదారులే సులభంగా గుర్తించేలా అవకాశం కల్పించింది. 


ఇందుకోసం వాట్సప్.. పాయింటర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్ వర్క్.. IFCN తో అనుసంధానమైంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులు తమకు వచ్చిన సందేశాలు సరైనవేనా..? కాదా..? అనే విషయాన్ని సులభంగా గుర్తించగలరు. పాయింటర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్ వర్క్.. ముందుగానే ఆ అంశాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ఉంచినట్లయితే ఇది సాధ్యపడుతుంది. ఇందుకోసం ఒక న్యూమెరికల్ మెనూను తయారు చేశారు. యూజర్లు నంబర్లు టైప్ చేయడం ద్వారా ఫేక్ మేసేజ్‌లను గుర్తించవచ్చు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే సౌలభ్యం ఉంది. త్వరలోనే హిందీ, స్పానిష్, పోర్చుగీస్ లాంటి భాషలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 


జనవరి నుంచి కరోనా వైరస్ ఉద్ధృతంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది. 74 దేశాల్లో 80 ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు.. దాదాపు 4 వేలకు పైగా నకిలీ వైరల్ వార్తలను కనిపెట్టాయి. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..