ప్రపంచ దేశాలను ప్రస్తుతం కలవరానికి గురిచేస్తున్న మరో వ్యాధి న్యూమోనియా (Unknown Pneumonia). కజకిస్థాన్‌లో ప్రబలుతున్న న్యూమోనియా తమ దేశాల్లోకి ఏ క్షణంలోనైనా ప్రవేశిస్తుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కజకిస్థాన్‌(Kazakhstan)లో గుర్తుతెలియనిదిగా భావిస్తోన్న న్యూమోనియాకు కోవిడ్19 (COVID-19) వైరస్ కారణమై ఉండొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) ప్రతినిధి డా. మైఖెల్ ర్యాన్ పేర్కొన్నారు. గత వారం ఆ దేశంలో ఏకంగా 10వేల కరోనా వైరస్ (CoronaVirus) కేసులు నమోదయ్యాయని మొత్తంగా 50వేల వరకు కేసులు వచ్చాయని తెలిపారు.  అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూహెచ్‌వో టీమ్ ఇప్పటికే కజకిస్థాన్ వెళ్లిందని, అక్కడ జరుగుతున్న టెస్టులు, పేషెంట్లకు చికిత్స వివరాలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వాస్తవానికి అవి కరోనా వైరస్ కేసులు అయ్యుండొచ్చునని, అయితే టెస్టులు సరిగా చేయకపోవడంతో కొత్త వ్యాధిగా భావిస్తున్న న్యూమోనియా కేసులుగా వెలుగు చూస్తున్నాయని WHO ప్రతినిధి వెల్లడించారు. అలా కాని పక్షంలో ఈ గుర్తుతెలియని న్యూమోనియాకు కోవిడ్19 వైరస్ కారణమై ఉండొచ్చునని చెబుతున్నారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


మరోవైపు కజకిస్థాన్‌లో ఉండే తమ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చైనా రాయబార కార్యాలయం ప్రకటన చేయడం గమనార్హం. ఈ న్యూమోనియాతో ఈ ఆరు నెలల కాలంలో కజకిస్థాన్‌లో భారీగా మరణాలు సంభవించాయని ఆందోళన మొదలైంది. అయితే ఈ కొత్త కేసులు కోవిడ్19 పాజిటివ్ కేసులు అయ్యుండొచ్చునని, లేక కరోనా వైరస్ కారణంగానే కొత్త న్యూమోనియాకు కారణమై ఉండొచ్చునని డా. మైఖెల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos