WHO experts back Covid booster dose for immunocompromised: కరోనా వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారికి బూస్టర్‌ డోసు (booster dose) అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) (World Health Organization) నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బూస్టర్‌ డోసుల వినియోగం గురించి ఇమ్యూనైజేషన్‌పై (Immunization‌) ఏర్పాటైన వ్యూహాత్మక సలహాల నిపుణుల బృందం చాలా చర్చలు చేపట్టాక చర్చించిన తర్వాత ఈ సిఫార్సు చేసింది. అయితే ఇందుకు సంబంధించిన తుది నివేదిక డిసెంబరులో విడుదల చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోగనిరోధక వ్యవస్థ (Immune system) మధ్యస్థాయి నుంచి తీవ్ర బలహీనంగా ఉండే వ్యక్తులు రెండు డోసులు తీసుకున్నా.. బలహీన రోగనిరోధకత వల్ల కొవిడ్‌-19 బారినపడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల డబ్ల్యూహెచ్‌ఓ (WHO) ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ డోసులకు అదనంగా మరో డోసు ఇవ్వాలి అని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం పేర్కొంది. అలాగే చైనాకు (China) చెందిన సినోవాక్‌, సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌లు తీసుకున్న 60ఏళ్ల పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా మూడో డోసు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం స్పష్టం చేసింది. 


Also Read : viral Wedding Dance: అదిరిపోయిన బావ-మరదలు డ్యాన్స్..నెటిజన్లతో ఈల వేయిస్తున్న వీడియో


రెండు డోసులు (Two doses) ఎక్కువ మందికి చేరిన తర్వాతే మూడో డోసు గురించి ఆలోచించాలని సూచించింది. అలాగే వ్యాక్సిన్‌ (Vaccine‌) పంపిణీలో తొలుత వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ బృందం సిఫార్సు చేసింది. అయితే ఇప్పటికే పలు దేశాలు మూడో డోసు పంపిణీ మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్‌, అమెరికాతో పాటు యూరప్‌లోని పలు దేశాలు బూస్టర్‌ డోసును (Booster dose) అందించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు (Breakthrough Infection) పెరగడం, కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తుండడంతో బూస్టర్‌ డోసు ఇస్తున్నట్లు ఆయా దేశాలు సమర్థించుకున్నాయి. ఇక తాజాగా డబ్ల్యూహెచ్‌ఓ (WHO) కూడా బూస్టర్‌ డోసు (Booster dose) వినియోగానికి సిఫార్సు చేయడంతో అన్ని దేశాలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టనున్నాయి. తమ దేశ ప్రజలు కరోనా (Corona) బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.


Also Read : NIA Raids: కశ్మీర్ హత్యలు, హెరాయిన్ పట్టివేత కేసుల విషయంలో ఎన్‌ఐఏ దాడులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి