Will vaccines work on Coronavirus B.1.1.529 Variant: ప్రపంచానికి వణికించిన కొరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ప్రజల్లో వైరస్‌పై అవగాహన ఏర్పడడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా దాదాపుగా అదుపులోకి వచ్చింది. ఇలాంటి సమయంలో దక్షిణాఫ్రికా (South Africa)లో తాజాగా వెలుగులోకి వచ్చిన B.1.1.529 వేరియంట్‌ ( B.1.1.529 Variant) మళ్లీ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్తరకం వేరియంట్‌లో అత్య‌ధిక స్థాయిలో మ్యుటేష‌న్లు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించడమే అందుకు కారణం. మునుపటి వేరియంట్ల కంటే B.1.1.529  వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయట. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ వేరియంట్‌ మ్యుటేష‌న్ల వ‌ల్ల మరోసారి తీవ్ర స్థాయిలో ప్ర‌మాదం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

B.1.1.529 వేరియంట్‌ను ముందుగా దక్షిణాఫ్రికా (South Africa)లో గుర్తించారు. ఈ కొత్త వేరియంట్‌ ఎలా ఉత్పన్నమైందన్న దానిపై ఇప్పటివరకు సరైన ఆధారాలు అయితే ఎక్కడ లేవు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఎయిడ్స్‌ రోగిలో ఈ వేరియంట్‌ ఉత్పన్నమై ఉంటుందని లండన్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 8.2 మిలియన్లకు పైగా ఎయిడ్స్‌ బాధితులు ఉన్నారు. గతంలో దక్షిణాఫ్రికాలో బయటపడ్డ బీటా వేరియంట్‌ కూడా ఎయిడ్స్‌ సోకిన వ్యక్తి నుంచే వచ్చినట్టు  నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే. కొత్త వేరియంట్‌కు సంబంధించి దక్షిణాఫ్రికాలోనే ఇప్పటివరకు 100కి పైగా కేసులు నమోదయ్యాయి.


మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారీ భూకంపం.. భయాందోళనకు గురైన క్రికెటర్లు! ఎక్కడో తెలుసా?


మొన్న‌టి వ‌ర‌కు భయపెట్టిన డెల్టా (Delta) వేరియంట్ క‌న్నా.. B.1.1.529 వేరియంట్‌లో ఎక్కువ మ్యుటేష‌న్లు జ‌రిగిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు (scientists) అంచ‌నా వేస్తున్నారు. కరోనాలో ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే ఇది చాలా భిన్నమైనదట. ఇందులో మొత్తం 50 మ్యుటేషన్లు ఉండగా.. ఒక్క స్పైక్‌ ప్రొటీన్‌లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్లు నిపుణులు చెప్పారు. ఇక మనిషి శరీరంలోకి వైరస్‌ ప్రవేశించడంలో స్పైక్‌ ప్రొటీనే కీలకంగా పనిచేస్తుందట. అధిక మ్యుటేషన్లు ఉండటంతో ఈ వైరస్‌ డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ల‌ను కూడా బోల్తా కొట్టించే వేరియంట్లు ఉత్ప‌త్తి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయట. 


Hyderabad: బాలుడిపై యువకుడు లైంగిక దాడి...చాక్లెట్ ఇస్తానని చెప్పి..


B.1.1.529 వేరియంట్‌ ( B.1.1.529 Variant) ఎంత వ‌ర‌కు వినాశ‌నం క‌లిగిస్తుంద‌న్న దానిపై అధ్యయనం చేయాల్సి ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు కొంత వ‌ర‌కు మాత్ర‌మే ర‌క్ష‌ణ ఇవ్వ‌గ‌ల‌వ‌ని వారు అంటున్నారు. మాస్క్‌లు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టన్స్ పాటించ‌డం ద్వారానే వైరస్‌ను అడ్డుకోగలమని శాస్త్ర‌వేత్త‌లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ల ప్ర‌భావం నుంచి B.1.1.529 వేరియంట్ త‌ప్పించుకుంటుందా? అన్న కోణంలో అధ్య‌య‌నం చేయ‌నున్నారట. కరోనా (CoronaVirus) ఇత‌ర వేరియంట్ల క‌న్నా B.1.1.529తో ఆందోళనకరమైన వ్యాధులు ఏమైనా వ‌స్తాయా అన్న కోణంలోనూ కూడా శాస్త్ర‌వేత్త‌లు స్ట‌డీ  చేయనున్నారట. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు విదుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు.. విదేశీ రాకపోకలను నిలిపివేశాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook