బ్యాంకుల కన్షార్షియమ్‌కు వేల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ లో తలదాచుకుంటున్న లిక్కర్  డాన్.. మరోసారి బ్యాంకులకు తన విన్నపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విజయ్ మాల్యా.. తీసుకున్న అప్పు మొత్తం తిరిగి ఇచ్చేస్తానని ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు అణా పైసాతో సహా  చెల్లిస్తా..'' ఇది మరోసారి బ్యాంకులకు లిక్కర్  కింగ్ విజయ్ మాల్యా చేసిన విజ్ఞప్తి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తీసుకున్న అప్పు 100 శాతం చెల్లిసానని ఆయన ట్వీట్ చేశారు.  కానీ బ్యాంకులు తన విన్నపాన్ని అస్సలు పట్టించుకోవడం లేదన్నారు.  అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా పట్టించుకోవడం లేదన్నారు.  జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయడం లేదన్నారు. ఈ విషయంలో  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాలని కోరారు. 'కరోనా వైరస్' మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలోనైనా తన విన్నపాన్ని అర్ధం చేసుకోవాలన్నారు.



'కరోనా'పై అమెరికా యుద్ధం
'కరోనా వైరస్' ను ఎదుర్కునేందుకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని విజయ్ మాల్యా సమర్థించారు. ఇది చాలా మంచి నిర్ణయమన్నారు. కింగ్ ఫిషర్ సహా  తన కంపెనీలన్నీ కార్యకలాపాలు ఆపేశాయని తెలిపారు. అంతే కాదు ఉద్యోగులను ఇంటి వద్దే ఉండమని చెప్పి.. జీతాలు కూడా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.  'కరోనా వైరస్' మహమ్మారితో ధీటుగా  పోరాడాలని ప్రజలు గుర్తుంచుకోవాలని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. అందరూ విధిగా సామాజిక దూరం పాటించాలని కోరారు. 


విజయ్ మాల్యా మార్చి 2016లో దేశం విడిచి లండన్ పారిపోయారు. ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఆయన్ను ఆర్థిక నేరగాడుగా ప్రకటించింది. ఇలా  ప్రకటించిన మొట్టమొదటి వ్యాపారవేత్త విజయ్ మాల్యా కావడం విశేషం.