World Dirtiest Man Dies: బలవంతంగా స్నానం చేయించారు.. ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తి మృతి!
World dirtiest man Amou Haji Dies at 94. ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి అమౌ హాజీ తుదిశ్వాస విడిచాడు. అక్టోబరు 23న ఇరాన్‌లోని దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో మరణించాడు.
World dirtiest man Amou Haji passes away at 94 after first bath in 60 years: ఆరు దశాబ్దాలుకు పైగా స్నానం చేయకుండా ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన ఇరాన్‌కు చెందిన ఓ వృద్ధుడు (94) మృతిచెందాడు. అక్టోబరు 23న (ఆదివారం) ఇరాన్‌లోని దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో అమౌ హాజీ తుదిశ్వాస విడిచినట్లు ది గార్డియన్ తమ నివేదికలో పేర్కొంది. అమౌ హాజీ నీటికి భయపడి (స్నానం చేస్తే అనారోగ్యానికి గురవుతాననే భయం) 60 ఏళ్లు దాటినా స్నానం చేయలేదు. అటువంటి వ్యక్తికి గ్రామస్థులు ఇటీవలే బలవంతంగా స్నానం చేయించారు.
ఇరాన్‌కి చెందిన 90 ఏళ్ల అమౌ హజీ అనే వృద్ధుడు 60 ఏళ్లుకు పైగా స్నానం చేయడం లేదు. అందుకు కారణం లేకపోలేదు.. హాజీకి నీళ్లంటే చాలా భయం. స్నానం చేస్తే అనారోగ్యానికి గురవ్వుతాననే భయం.. అతడికి ఓ ఫోబియాగా మారింది. హాజీకి 20-25 ఏళ్ల వయస్సు ఉన్నపుడు ఈ ఫోబియా వచ్చిందట. అప్పటినుంచి అతడు స్నానం చేయడం మానేశాడు. ఇన్నాళ్ళుగా సబ్బుతో ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్న దాఖలాలూ లేవు. హజీ ఎప్పుడూ తలపై యుద్ధంలో సైనికులు పెట్టుకొనే హెల్మెట్ అతడు ధరిస్తాడు.
అమౌ హజీ ఆహారపు అలవాట్లు వింతగా ఉంటాయి. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడానికి మాత్రమే ఇష్టపడతాడు. పంది కొక్కులు, కుందేళ్లను తింటూ.. నీటి కుంటల్లో నీరు తాగుతూ జీవనం కొనసాగించాడు. హజీకి స్మోకింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అయితే అతడు పొగాకు కాకుండా.. జంతువుల మలాన్ని పీలుస్తాడు. బాగా ఎండిపోయిన మలాన్ని.. తుప్పు పట్టిన పైపులో వేసుకుని హజీ స్మోక్ చేస్తాడు.
అమౌ హజీ విచిత్ర జీవన శైలి, కుటుంబీకులు ఎవ్వరూ లేకపోవడంతో గ్రామస్తులు అతడి కోసం నివాసాన్ని ఏర్పాటు చేశారు. అయితే హజీ అప్పుడప్పుడూ సొరంగాలు తవ్వి అందులోనే ఉండేవాడు. హజీకి గతంలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆరోగ్యంగా ఉండడంతో శాస్త్రవేత్తలు షాక్ తిన్నారు. 60 ఏళ్లుకు పైగా స్నానం చేయకపోయినప్పటికి అతని శరీరంలో ఎలాంటి పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు లేవట. ఇలా వింత జీవితాన్ని గడుపుతోన్న ఆ వృద్ధుడిపై 2013లో ఓ డాక్యుమెంటరీ వచ్చింది. హజీకి గ్రామస్థులు కొన్ని నెలల క్రితం బలవంతంగా స్నానం చేయించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే అతడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
Also Read: అబ్బా డేవిడ్ వార్నర్.. ఏమన్నా ఫీల్డింగ్ చేశావా! వీడియో చూసి తీరాల్సిందే
Also Read: Multibagger stock: రెండేళ్లలో లక్ష రూపాయల్ని 14 లక్షలు చేసిన షేర్, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook