AstraZeneca vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. వ్యాక్సిన్‌ల సామర్ధ్యంపై ప్రశ్నలు వస్తున్న తరుణంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిలిపివేశారు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్‌కు(Coronavirus)వ్యాక్సిన్ వచ్చినా వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిగానే సాగుతోంది. దీనికి కారణం వ్యాక్సిన్‌పై ప్రజలకు నమ్మకం లేకపోవడమే. వ్యాక్సిన్‌ల సామర్ధ్యంపై ప్రశ్నలు వస్తున్న సమయంలోనే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమస్యల్లో పడింది. కొన్ని యూరోపియన్ దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో వ్యాక్సిన్ వినియోగాన్ని ఆయా దేశాల్లో నిలిపివేశారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (Astrazeneca vaccine) వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేయాల్సిన అవసరం లేదని చెప్పింది.  మిగిలిన వ్యాక్సిన్‌లతో పోలిస్తే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అద్భుతమైన టీకా అని..నిలిపివేయాల్సిన పని లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation) ప్రతినిధి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అడ్వైజరీ కమీటీ వ్యాక్సిన్‌కు సంబంధించిన డేటాను పరిశీలించిందని..వ్యాక్సిన్‌కు , రక్తం గడ్డకట్టడానికి ఏ విధమైన సంబంధం లేదని తేలిందని చెప్పారు. మరోవైపు మృతులకు సంబంధించిన డేటాను కూడా పరిశీలించామని..వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కారణంగా ఎవరూ మరణించలేదని వెల్లడించారు. 


యూరోపియన్ ఎకనమిక్ ప్రాంతంలో ఇప్పటి వరకూ అంటే మార్చ్ 9 వరకూ 30 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. రక్తం గడ్డకట్టిన కేసులు కేవలం 22 నమోదయ్యాయి. ఫలితంగా డెన్మార్క్(Denmark), నార్వే(Norway), ఐస్‌లాండ్ (Iceland) దేశాలు వ్యాక్సిన్ నిలిపినేస్తున్నట్లు ప్రకటించాయి.


Also read: H1B Visa: ఐటీ ఉద్యోగులకు శుభవార్త, హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోవాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook