హాయిగా గాలిలో ఎగురుతూ పోతుంటే చాలా బాగుంటుంది కదూ. ఇప్పుడిది ఎంతో దూరంలో లేదు. త్వరలో బైక్‌పై ఎగురుతూ పోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..ముమ్మాటికీ నిజం. ఇక బైక్‌పై ఎగరవచ్చు. కేవలం 2-3 ఏళ్లలో మార్కెట్లో ఈ ఫ్లైయింగ్ బైక్ కన్పించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లైయింగ్ బైక్ అనేది ఇప్పుడు కల కాదు. వాస్తవం. చాలామంది ఒకానొక సమయంలో కార్లు, బైక్‌లు ఎగురుతూ వెళ్తుంటే ఎలా ఉంటుందని ఆలోచించేవారు. ఇప్పుడు అమెరికా కంపెనీ ఈ ఆలోచనను నిజం చేసింది. ప్రపంచపు తొలి ఫ్లైయింగ్ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ వినూత్నమైన బైక్ పేరు స్పీడర్. ప్రారంభ ధర 3.15 కోట్ల రూపాయలు. రానున్న 2-3 ఏళ్లలో మార్కెట్‌లో లాంచ్ కానుంది. 


గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎగిరే ఈ బైక్ గాలిలో దాదాపు 100 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. స్పీడర్ ఫ్లైయింగ్ బైక్ ఒకేసారి గాలిలో 30-40 నిమిషాలు ఎగురగలదు. మెడికల్ ఎమర్జెన్సీ, మంటలు ఆర్పడం, ఆర్మీ రంగాల్లో ఉపయోగపడుతుంది. ఈ బైక్‌ను సామాన్యులు కూడా నడపగలరు. రిమోట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. 136 కిలోల బరువుండే ఈ బైక్..272 కిలోల బరువు మోయగలదు. అమెరికాకు చెందిన జెట్ ప్యాక్ కంపెనీ ఈ బైక్‌ను తయారుచేసింది. ప్రస్తుతం ఈ కంపెననీ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తోంది. స్పీడర్‌లో 8 టర్బైన్స్ వినియోగించారు. 


జపాన్ కంపెనీ ద్వారా మరో ఫ్లైయింగ్ బైక్


గత ఏడాది జపాన్‌కు చెందిన కంపెనీ AERQINS కూడా అమెరికా డెట్రాయిట్ ఆటో షోలో ఫ్లైయింగ్ బైక్‌ను ప్రదర్శించింది. ఈ బైక్ గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. AERQINS అనేది అమెరికాకు చెందిన హోవర్ బైక్‌తో కలిసి ఈ బైక్ లాంచ్ చేయనుంది. 300 కిలోల బరువున్న ఈ బైక్ 100 కిలోల బరువు మోయగలదు. 


Also read: Helicopters Collided: హెలీక్యాప్టర్లు ఢీకొని నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook