ప్రపంచంలోనే అతి పెద్ద సముద్ర వంతెనను ఇవాళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘనంగా ప్రారంభించారు. సముద్రం మీద నుంచి హాంగ్ కాంగ్, మకౌ, చైనా మెయిన్ ల్యాండ్‌లోని జుహై నగరాన్ని అనుసంధానించే ఈ బ్రిడ్జి పొడవు 34 మైళ్లు (55 కిలో మీటర్లు). తొమ్మిదేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ బ్రిడ్జీ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. ముందస్తు ప్రణాళికల ప్రకారం 2016లోనే ప్రారంభానికి నోచుకోవాల్సి ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం అప్పటికి పూర్తి కాని కారణంగా మరో రెండేళ్లు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్మాణ వ్యయం:
సుమారు 20 బిలియన్ డాలర్ల వ్యయంతో సముద్రంపై నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర వంతెన రికార్డుకెక్కింది.


నిర్మాణానికి పట్టిన సమయం:
9 ఏళ్లు


అత్యంత ప్రత్యేకమైన విషయం:
భూకంపాలు, తుఫాన్లు తట్టుకుని నిలబడేలా 60 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సమానమైన 4,00,000 టన్నుల ఇనుము ఉపయోగించి ఈ వంతెనను నిర్మించారు. 


నిర్మాణ లక్ష్యం: హాంగ్ కాంగ్, మకౌ సహా చైనాలోని 9 నగరాలను అనుసంధానిస్తూ రోడ్డు మార్గాన్ని నిర్మించాలనే లక్ష్యంతో చైనా రూపొందించిన ప్రణాళికకు రూపమే ఈ పొడవైన సముద్ర వంతెన. ఈ వంతెన కింది నుంచి భారీ నౌకలు సైతం దాటుకుని వెళ్లడానికి వీలుగా వంతెన నిర్మాణం పూర్తిచేశారు.