Cheapest Fuel Price: ఇంధన ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్-డీజిల్ ధర ఇప్పటికే సెంచరీ దాటి పరుగెడుతోంది. కానీ అక్కడ మాత్రం ఇంకా లీటర్ పెట్రోల్ రూపాయిన్నర మాత్రమే. ఆశ్చర్యంగా ఉందా. అయితే ఇది చదవండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో పెట్రోల్-డీజిల్ ధరలు(Petrol-Diesel Prices)రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పెరిగిన చమురు ధరల పేరుతో ఆయిల్ కంపెనీలు, వివిధ రకాల పన్నులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంధన ధరల్ని అమాంతంగా పెంచేశాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధర ఎప్పుడో సెంచరీ దాటేసిన పరిస్థితి. అయితే కొన్నిదేశాల్లో మాత్రం పెట్రోల్ ధర చాలా చీప్. ఎంతంటే అగ్గిపెట్టె ధర కంటే తక్కువ. నమ్మలేకున్నా..నిజమే ఇది. సామాన్యులు మోయలేని దశకు పెట్రోల్, డీజిల్ ధరలు చేరినా ఇంకా నష్టాల్లోనే ఉన్నామంంటూ ఆయిల్ కంపెనీలు(Oil Companies)సంకేతాలు పంపిస్తున్నాయి. 


అయితే ఆ దేశంలో మాత్రం అగ్గిపెట్టె కొనే ఖర్చుతో లీటల్ పెట్రోల్ కొనవచ్చు. అది వెనిజులా(Venizula). దక్షిణ అమెరికా ఖండంలోని ఈ లాటిన్ దేశంలో చమురు నిక్షేపాలు అపారం. అమెరికా ఆయిల్ సరఫరా తీర్చడంలో ఈ దేశానిదే కీలకపాత్ర. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ ధర కేవలం 0.02 డాలర్లు మాత్రమే. అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం రూపాయిన్నర. చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో అతి తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అందిస్తోంది. వెనిజులా తరువాత అతి తక్కువ ధరకే పెట్రోల్ లభించే దేశం ఇరాన్(Iran). ఇక్కడ లీటర్ పెట్రోల్ 0.06 డాలర్లు అంటే ఇండియన్ రూపీస్‌లో 4 రూపాయల 51 పైసలు. అంతర్యుద్ధంలో నలుగుతుండే సిరియాలో కూడా కేవలం 17 రూపాయలు మాత్రమే. ఇక అంగోలా, ఆల్జీరియా, కువైట్, నైజీరియా, తుర్క్‌మెనిస్తాన్, ఖజకిస్తాన్, ఇథియోపియా వంటి చిన్న చిన్న దేశాల్లో అయితే కేవలం 40 రూపాయలు మాత్రమే ఉంది.


ఇక పెట్రోల్ ధర అధికంగా ఉండే దేశాల్లో మొదటి స్థానం హాంగ్‌కాంగ్. చైనాలో అంతర్భాగమైనా సరే పెట్రోల్ ధర చాలా ఎక్కువ. లీటర్ పెట్రోల్ 192 రూపాయలుంది. హాంకాంగ్ తరువాత నెదర్లాండ్స్‌లో లీటర్ పెట్రోల్ 163 రూపాయలుంది. ఇక సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ లో 160 రూపాయలు కాగా, నార్వే, ఇజ్రాయిల్, డెన్మార్క్, మొనాకో, గ్రీస్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్ దేశాల్లో లీటర్ పెట్రోల్ 150 రూపాయలకు పైనే ఉంది. ఇండియాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 111 రూపాయలు దాటేసింది. ఏడాదిలో ఏకంగా 37 రూపాయల వరకూ పెరిగింది.


Also read: China Delta Variant: చైనాను వెంటాడుతున్న డెల్టా వేరియంట్, పెరుగుతున్న కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook