టాటా.. వీడ్కోలు.. గుడ్‌బై: యాహూ మెసెంజర్ ఇక లేదు
ఒకప్పటి పాపులర్ యాహూ మెసెంజర్ సర్వీస్ `యాహూ మెసెంజర్` ప్రస్థానం ఇవాల్టితో ముగియనుంది.
ఒకప్పటి పాపులర్ మెసెంజర్ సర్వీస్ 'యాహూ మెసెంజర్' ప్రస్థానం ఇవాల్టితో ముగియనుంది. 1998, మర్చి 9న యాహూ పేజర్‌గా మొదలై.. ఆ తరువాత ఏడాది యాహూ మెసెంజర్‌గా మారింది. ఈ 20 ఏళ్లలో చాలా ఎత్తుపల్లాలను ఈ సంస్థ చవిచూసింది. వాట్సాప్, ఫేస్‌బుక్, సాఫ్ట్ చాట్ సంస్థలు మెసెంజర్ రంగంలోకి రావడంతో 'యాహూ మేసేజర్' బాగా డీలా పడిపోయింది. డౌన్‌లోడ్‌ల సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. చివరకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా యాహూ మెయిల్ సర్వీస్ యథావిధిగా కొనసాగనుంది.
యాహూ మెసెంజర్ ప్రస్థానం:
గూగుల్ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో యాహూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు. మెయిల్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్నా యాహూ నుంచే చేయాల్సి వచ్చేది. అది.. మార్చి 9,1998. అప్పుడు ఒకరితో మరొకరు ఫోన్లలో మాట్లాడుకోవడమే గొప్ప. అప్పుడప్పుడే ఇంటర్నెట్ విస్తరిస్తోంది. సరిగ్గా ఆ రోజు యాహూ పేజర్ ప్రారంభమైంది. నెటిజన్ల నుంచి యమ రెస్పాన్స్ రావడంతో మరిన్ని మార్పులు చేసి కొన్ని జూన్ 21, 1999న 'యాహూ మెసెంజర్' పేరుతో మెసెంజర్ చాట్‌ను లాంచ్ అయ్యింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు లేని కమ్యూనికేషన్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది ఈ యాహూ మెసెంజర్.
2001లో కోటి 10 లక్షల మంది యూజర్లు మెసెంజర్ ఒడిలో చేరారు. ఆ తరువాత 2003లో కోటి 70 లక్షల యూజర్లు, 2006లో కోటి 93 లక్షల యూజర్లు, 2007లో ఆరు కోట్ల 20 లక్షల యూజర్లు, 2009కి వచ్చేసరికి 12 కోట్ల 26 లక్షల యూజర్లకు పెరిగింది. కానీ ఆర్కుట్, ఫేస్‌బుక్, వాట్సప్, హ్యాంగౌట్ లాంటి కొత్త సర్వీసులు రావడంతో యాహూ మెసెంజర్ తొలిసారి తీవ్రమైన పోటీని ఎదుర్కొంది. ఆతరువాత మెసెంజర్ కొత్త వెర్షన్, అప్‌డేట్‌లు రిలీజ్ చేసినా నెటిజన్లను పెద్దగా ఆకట్టుకోలేదు. యువత కూడా వాట్సప్, ఫేస్‌బుక్ మోజులో పడి మెసెంజర్‌ని పూర్తిగా మర్చిపోయారు. డౌన్‌లోడ్ సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. ఈ ప్లాట్‌ఫామ్‌ను శాశ్వతంగా మూసేద్దామని ఓ నిర్ణయానికి వచ్చింది. జులై 17, 2018 నుంచి యాహూ మెసెంజర్‌ను షట్‌డౌన్ చేసింది యాహూ పేరెంట్ కంపెనీ ఓత్.
యాహూ మెసెంజర్ షట్‌డౌన్ కావడంతో.. నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. తాము కుటుంబంతో టచ్‌లో ఉండేందుకు మెసెంజర్ ఉపయోగపడిందని కొందరు కృతజ్ఞతలు చెప్పగా.. మరికొందరు యాహూ మెసెంజర్ రిప్, గుడ్‌బై అంటూ ట్వీట్ చేస్తున్నారు.
యూజర్లు తమ ఛాట్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి 6 నెలల గడువు ఇచ్చిన కంపెనీ.. ఆ తర్వాత సర్వర్‌లోంచి ఆ డేటా మొత్తం డిలిట్ అవుతుందని పేర్కొంది. యాహూ మెసెంజర్‌ని ఆదరించినవారందరికీ కంపెనీ కృతజ్ఞతలు చెప్పింది. అయితే కంపెనీ కొత్తగా తీసుకొస్తున్న గ్రూప్ మెసేజింగ్ యాప్ యాహూ స్క్విరెల్‌కు యాహూ మెసెంజర్‌లా హిట్ అవుతుందో లేదో లేదో చూడాలి.