Electric Bike Blast in Vijayawada: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. అదే విధంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ (Vijayawada) సూర్యారావుపేటలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్థానిక గులాబీపేటలో ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలి (Electric Bike battery explosion) ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో అతడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యారావుపేటకు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి శుక్రవారం కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ (E-bike) కొనుగోలు చేశాడు. ఇంట్లో బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. అయితే తెల్లవారుజామున బ్యాటరీ పేలి.. శివకుమార్‌తోపాటు భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలిస్తుండగా.. .. శివకుమార్‌ మృతి చెందాడు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


పెట్రోల్ ఖర్చు, పొల్యూషన్‌ ఉండదు కాబట్టి చాలా మంది ఎలక్ట్రిక్ వాహానాల (Electric vehicles) వైపు మెుగ్గుచూపుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు బాంబుల్లా పేలిపోతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించే కంపెనీల నుంచే ఈ బైక్‌లను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. 


Also Read: Gang Rape: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం... యువతిని 30 గం. పాటు బంధించి గ్యాంగ్ రేప్... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.