Vijayawada Gang Rape: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం వెలుగుచూసింది. ఓ మానసిక వికలాంగురాలిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. యువతిని 30 గంటల పాటు ఓ చిన్న గదిలో బంధించి ఆమెపై ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి మాయ మాటలతో ఆమెను తనతో పాటు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... విజయవాడ వాంబే కాలనీకి చెందిన దారా శ్రీకాంత్ (26) అనే యువకుడు ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన 23 ఏళ్ల ఓ యువతిపై అతని కన్ను పడింది. మానసిక వికలాంగురాలైన ఆమెకు ప్రేమ, పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి నమ్మించాడు.
ఈ నెల 19వ తేదీ రాత్రి తాను ఆసుపత్రిలో విధులకు వెళ్లే సమయంలో ఆ యువతిని కూడా వెంట తీసుకెళ్లాడు శ్రీకాంత్. బ్యాగులో దుస్తులు సర్దుకుని ఆ యువతి అతనితో పాటు వెళ్లింది. ఆసుపత్రిలోని ఓ చిన్న గదిలో ఆమెను బంధించిన శ్రీకాంత్ ఆ రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటిరోజు ఆమెకు చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె ఆసుపత్రిలోనే అటు, ఇటు తిరుగుతుండగా బాబురావు, పవన్ అనే మరో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు ఆమెపై కన్నేశారు. అదే గదిలో యువతిని బంధించి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
20వ తేదీ ఉదయం యువతి తల్లిదండ్రులు ఆమె కనిపించట్లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా... పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఆలస్యంగా స్పందించారని... త్వరగా స్పందించి ఉంటే బాబురావు, పవన్‌ల బారి నుంచి ఆమె బయటపడి ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Telangana Weather: తెలంగాణలో 5 డిగ్రీల మేర తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు... మరో 4 రోజులు వర్షాలే...!
Also Read: MS Dhoni: ధోనీ బ్రెయిన్ ఎంత షార్పో.. పొలార్డ్‌ను ఎలా కమ్మేశాడో చూడండి... వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.