YSRCP Rajya Sabha MPs: అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో ఎవరూ ఎదుర్కోని ఘోర పరాభవాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కథ ఇక ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్నట్టుగానే జరుగుతున్నాయి. ఆ పార్టీ పతనం అంచుకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో నాయకులు ఉండలేకపోతున్నారు. గౌరవప్రదమైన సీట్లు కూడా రాకపోవడంతో పార్టీ నాయకులు అవమానంగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో పార్టీ పుంజుకోదని భయం.. అధికార పార్టీ వేధింపులకు పాల్పడుతుందనే మరో ఆందోళనతో వైఎస్సార్‌సీపీలో ఇమడలేకపోతున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా


దీనికితోడు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీరుతో ఎప్పటి నుంచో అసహనంతో ఉన్న వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అది ఏ స్థాయిలో అంటే ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే స్థితిలో అంతటి సంఖ్యలో నాయకులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. తాజాగా పార్లమెంట్‌లో కీలకమైన రాజ్యసభలో ఏకంగా ఉనికి కోల్పోయే స్థితిలో వైఎస్సార్‌సీపీలో రాజీనామాలు ఉంటాయని చర్చ జరుగుతోంది.

Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!


పార్టీ సంక్షోభంలో నెట్టే పనిని ఎంపీ మోపిదేవి వెంకటరమణ శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ఆయనతో మొదలైన రాజీనామాలు రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ విలీనమే లక్ష్యంగా సాగుతోంది. ఈ క్రమంలోనే 10 మంది రాజ్యసభ సభ్యులు వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కూటమి పార్టీల కండువాలు కప్పుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అందులో భాగంగా తెలుగుదేశం పార్టీలోకి ముగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జనసేనలోకి ఇద్దరు చేరతారనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వస్తున్న సమాచారం ప్రకారం గురువారం రాజ్యసభ చైర్మన్‌ను ఈ ఎంపీలు కలిసి తమ రాజీనామాలు పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఇక వారితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పార్టీ మారనున్నారు.


విశ్వసనీయ సమాచారం ప్రకారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఏ పార్టీలో చేరతారనేది తెలిసింది. ఏయే ఎంపీ ఏ పార్టీలో చేరతారో జాబితా ఇదే!


తెలుగుదేశం: మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, బీద మస్తాన్‌రావు


బీజేపీ: రఘునాథ్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని


జనసేన: పిల్లి సుభాష్ చంద్రబోస్, ర్యాగ కృష్ణయ్య


ఒకే ఒక్కడు ఎవరు?
పది మంది రాజీనామాలతో వైఎస్సార్‌సీపీ నిలువునా చీలిపోనుంది. అసలు రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఉన్న 11 మందిలో ఒకరు మాత్రం పార్టీతోనే కొనసాగుతారని సమాచారం. ఆ ఒకే ఒక్క ఎంపీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కాంట్రాక్ట్‌లు, నిధులు, పదవుల ఆశతో ఆ ఎంపీలు పార్టీ మారనున్నారు. ఒక్కరూ కూడా జగన్‌ మాటపై నిలబడే అవకాశం లేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook