Wayanad Destruction: వయనాడ్ విలయం తుడుచుకుపోయిన చూరల్ మల, ముందక్కై గ్రామాలు, 270 కు చేరిన మరణాలు

కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం, మడ్ ఫ్లడ్ విలయంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. వయనాడ్ విధ్వంసం పోటోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Wayanad Destruction: కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం, మడ్ ఫ్లడ్ విలయంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. వయనాడ్ విధ్వంసం పోటోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
 

1 /15

నదీ ప్రవాహానికి  అవతలివైపు చిక్కుకున్నవారిని రక్షించేందుకు 330 నుంచి 690 అడుగుల బెల్లీ వంతెనలు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ఈ వంతెనల్ని ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి రప్పించారు. 

2 /15

ఇప్పటి వరకూ ఇండియన్ ఆర్మీ 1000 మందిని సురక్షితంగా కాపాడగలిగింది. పునరావాస శిబిరాలకు దాదాపు 10 వేలమందిని తరలించారు. ఎక్కడెక్కడ జనావాసాలున్నాయో రెవిన్యూ సిబ్బంది సహాయంతో మ్యాపింగ్ చేసి శిథిలాలను వెలికి తీస్తున్నారు. 

3 /15

4 /15

హెలీకాప్టర్లు, తాత్కాలిక వంతెనల నిర్మాణంతో చిక్కుకున్నవారికి కాపాడుతున్నారు. రోప్ సహాయంతో అటు నుంచి ఇటు దాటిస్తున్నారు. ఇంకొందరు మాననహారంగా ఏర్పడి రక్షిస్తున్నారు. 

5 /15

ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కేరళ పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది నిరంతరం సహాయక చర్యల్లో మునిగి ఉంది. సహాయక చర్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. 

6 /15

7 /15

ముందక్కై, మెప్పాడి, అట్టమాల, చూరల్ మల గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా 250 మంది వరకూ ఆచూకీ లభ్యం కావల్సి ఉంది. 

8 /15

9 /15

వయనాడ్ విలయం ధాటికి బలైన గ్రామాల్లో అక్కడక్కడా కన్పిస్తున్న ఇళ్లు పెద్ద భవనాలు. మిగిలినవన్నీ బురదలో కూరుకుపోయాయి. బురద ప్రవాహంలో ఎన్ని మృతదేహాలున్నాయో తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

10 /15

11 /15

చూరల్ మల గ్రామం పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. దాదాపు 500 ఇళ్లున్న ఈ గ్రామంలో అక్కడక్కడా 40 వరకూ ఇళ్లు మిగిలాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

12 /15

13 /15

వయనాడ్ జిల్లాలో కొంచ చరియలు విరిగి పడి భారీగా బురద, రాళ్లు రప్పలు కొట్టుకురావడంతో మెప్పాడి, ముందక్కై, చూరల్ మలా, అట్టమాల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బురద ప్రవాహం గ్రామాల్ని ముంచెత్తింది. అర్ధరాత్రి దాటాక ముంచుకొచ్చిన విలయం కావడంతో అంతా నిద్రలోనే శాశ్వత సమాధి అయ్యారు.

14 /15

ముందక్కైలో 450 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 49 ఇళ్లు మిగిలుండవచ్చు. చెట్లను పట్టుకుని కొందరు, మంచాలపై పడుకున్న స్థితిలో ఇంకొందరు, బరుదలో కూరుకును పోయి కొందరు ప్రాణాలు కోల్పోయి కన్పిస్తున్నారు.

15 /15

జూలై 29వ తేదీ అర్ధరాత్రి..తెల్లవారుజామున 2 గంటల తరువాత మొదలైన విలయం వయనాడ్ జిల్లాలో నాలుగు గ్రామాల్ని నాశనం చేసింది. చూరల్ మల గ్రామం తుడుచుపెట్టుకుపోయింది. మృతుల సంఖ్య 270 వరకూ ఉండవచ్చని అంచనా. ఇప్పటికీ ఇంకా 240 మంది ఆచూకీ లభ్యం కాలేదు.