కర్నూలు: జిల్లాలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వెల్దుర్తి క్రాస్‌ రోడ్డు వద్ద ఎదురుగా వస్తోన్న ఓ బైక్‌ను తప్పించబోయిన క్రూజర్ డ్రైవర్ పొరపాటున మరోవైపు నుంచి వస్తోన్న ప్రైవేటు బస్సును క్రూజర్‌‌తో వేగంగా ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో క్రూజర్‌లో ప్రయాణిస్తోన్న గద్వాల జిల్లా పామవరం గ్రామానికి చెందిన 15మంది దుర్మరణంపాలయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. పామవరం వాసులు పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"178343","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. ప్రత్యక్షసాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం ద్విచక్రవాహనంపై వచ్చిన వారి పొరపాటే ఈ ప్రమాదానికి తొలి కారణమైందని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.