ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి. ఓ వైపు కోవిడ్ 19 వైరస్ నిర్ధారణ పరీక్షలు పెరుగుతుంటే..మరోవైపు కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు సిబ్బంది 16 మందికి కరోనా సోకింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా  ఏపీ హైకోర్టు సిబ్బంది 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో మరోసారి హైకోర్టు కార్యకలాపాల్ని రద్దు చేశారు. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు పరిధిలోని ఇతర దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాల్ని రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అత్యవసర పిటీషన్లకు మాత్రం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. Also read: New Era in AP: ఏపీలో రేపటి నుంచి ఆధునిక అంబులెన్స్ లు ప్రారంభం


కేవలం ఐదు రోజుల క్రితమే హైకోర్టు కార్యకలాపాల్ని జూన్ 28 వరకూ రద్దు చేయగా..రెండ్రోజుల్నించి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏపీ హైకోర్టు, విజయవాడ మెట్రో పాలిటన్ కోర్టుల విధుల్ని సస్పెండ్ చేయాలన్న ఛీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు జూన్ 25న నాలుగు రోజుల వరకూ హైకోర్టు విధుల్ని నిలిపివేశారు. ఇప్పుడు తాజాగా 16 మందికి కరోనా వైరస్ సోకడంతో మరోసారి హైకోర్టు కార్యకలాపాల్ని రద్దు చేశారు. Also read: AP Covid19 Cases: ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా 12 మంది మృతి


రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11 వేల 595కు చేరుకోగా...187 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 వేల 897 యాక్టివ్ కేసులున్నాయి. Also read: Sleeping Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి